
సత్తు పిండి డ్రింక్ రెసిపీకి కావలసిన పదార్థాలు: నాలుగు టేబుల్ స్పూన్స్ సత్తు పిండి, రెండు గ్లాస్ లు చల్లటి నీరు, రెండు టేబుల్ స్పూన్స్ బెల్లం పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రుచికి సరిపడా చిటికెడు ఉప్పు, నాలుగు ఐస్ క్యూబ్స్ ,తరిగి పెట్టుకున్న పుదీనా ఆకులను తీసుకోవాలి.

సత్తు పిండి డ్రింక్ రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : ఒక గిన్నెలో సత్తు పిండిని తీసుకుని, దానిలో కొద్దిగా నీరు పోసి ఉండలు లేకుండా దీనిని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా చల్లటి నీటిని పోస్తూ మిక్స్ చెయ్యాలి. ఇంకా దీనిలో కొద్దిగా ఇప్పుడు బెల్లం కూడా పొడి వేసి మొత్తం కరిగేపోయే వరకు కలపాలి.

సత్తు పిండి డ్రింక్ రెసిపీ తయారీ విధానం స్టెప్ 2 : ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకటికి రెండు సార్లు బాగా కలపాలి. ఇంకా దీనిలో మీరు కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం కూడా వేసి ఈ టెస్ట్ ను ఎక్కువ పెంచుకోవచ్చు. ఇంకా దీనిలో నాలుగు పుదీనా ఆకులు కూడా వేసి కలిపితే ఫ్రెష్ గా ఉంటుంది.

సత్తు పిండి డ్రింక్ రెసిపీ తయారీ విధానం స్టెప్ 3 : ఇంకా ఈ గ్లాస్‌లో నాలుగు ఐస్ క్యూబ్స్ వేసి సత్తు పిండి డ్రింక్ పోయాలి. దీని పైన అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి చల్లితే రుచి అద్భుతం అని చెప్పాలి. ఇంకా ఇలా తయారు చేసుకున్న తరవాత దీనిని చల్లగా తాగితే అబ్బబ్బా సూపర్ అంటూ తాగుతారు.

మీరు దీనిని ఉదయం పూట టిఫిన్ తో పాటు దీనిని తీసుకోవచ్చు ఇంకా స్నాక్ టైమ్‌లో కూడా తాగొచ్చు. (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)