Poco X5 Pro 5G.. ఇటీవల విడుదల చేసిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 25,000లోపు బడ్జెట్ లో గేమ్ ఛేంజర్. దీనిలో పోకో తొలిసారి 108ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాను అందించింది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 778జీ చిప్ ఉంది. దీనితో పాటు, ఫోన్ డాల్బీ విజన్ సపోర్ట్‌తో 120Hz హెచ్డీఆర్ 10 ప్లస్ డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు, 5,000mAh బ్యాటరీ ఉంటుంది. అంతేకాక 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.
OnePlus Nord CE 2 5G.. మీరు రూ. 25,000 లోపు నమ్మదగిన స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్. దీనిలో 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్న శక్తివంతమైన అమోల్డ్ స్క్రీన్ కిలిగి ఉంది. హెచ్డీఆర్ 10 ప్లస్ వీడియో ప్లేబ్యాక్‌కు మద్దతునిస్తుంది. దీనిలో 4,500mAh బ్యాటరీ ఉంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది, కేవలం 45 నిమిషాల్లో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయగలదు.
Realme 10 Pro 5G.. పోకో ఎక్స్ 5 మాదిరిగానే దీనిలో కూడా వెనుకవైపు 108MP ప్రైమరీ కెమెరా ఉంది. ఇది రూ. 20,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. దీనిలో స్నాప్‌డ్రాగన్ 695 SoC, 5,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతుంది.
Redmi Note 12 5G.. దీనిలో 120Hz అమోల్డ్ డిస్ ప్లే ఉంది. 5జీ కనెక్టివిటీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను అందిస్తోంది. ఇది 4GB, 6GB ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది కడా రూ. 20,000లకే లభ్యమవుతుంది.