రోజూ 1 కప్పు తాగితే.. ఒంటి నొప్పులు మాయం.. సత్తువనిచ్చే హెల్దీ డ్రింక్

Updated on: Nov 03, 2026 | 6:37 PM

వయసుతో సంబంధం లేకుండా నేటి రోజుల్లో చాలామందిని వేధించే ప్రధాన సమస్యలు రక్తహీనత, ఎముకల బలహీనత, మోకాళ్ల నొప్పులు మరియు తీవ్రమైన నిస్సత్తువ. వీటికి మార్కెట్లో దొరికే సప్లిమెంట్లు లేదా కెమికల్ ఎనర్జీ పౌడర్ల కంటే.. మన ఇంట్లోనే సహజసిద్ధమైన డ్రై ఫ్రూట్స్, పోషకాలు నిండిన గింజలు (సీడ్స్), పాలు మరియు బెల్లంతో చేసుకునే ఈ 'హెల్దీ ఎనర్జీ పాయసం' రోజుకు ఒక కప్పు తాగితే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి, ఎముకలను ఉక్కులా మార్చడానికి ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

1 / 5
కావలసిన పదార్థాలు: 10 నుండి 12 బాదం పప్పులు,  4 నుండి 5 వాల్‌నట్స్, 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, 1 టీస్పూన్ గసగసాలు, అర లీటర్ చిక్కటి పాలు,  అర కప్పు తురిమిన బెల్లం, పావు కప్పు నీళ్లు, 1 టీస్పూన్ ఆవు నెయ్యి, జీడిపప్పు, బాదం తరుగు – వేయించడానికి కొద్దిగా, యాలకుల పొడి – పావు టీస్పూన్

2 / 5
తయారీ విధానం: ఒక గిన్నెలో బాదం పప్పులు, వాల్‌నట్స్, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు మరియు 1 టీస్పూన్ గసగసాలు వేసి తగినన్ని నీళ్లు పోసి కనీసం 2 గంటల పాటు నానబెట్టాలి. నానిన తర్వాత బాదం తొక్కలు తొలగించాలి. వీటిని మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా పాలు పోసి ఎక్కడా పలుకు లేకుండా చాలా మెత్తటి నునుపైన పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
చిన్న గిన్నెలో అర కప్పు తురిమిన బెల్లం, పావు కప్పు నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తీగ పాకం అవసరం లేదు. వెడల్పాటి గిన్నె లేదా కడాయిలో అర లీటర్ చిక్కటి పాలు పోసి మీడియం మంటపై మరిగించాలి.

4 / 5
పాలు మరుగుతున్నప్పుడు గ్రైండ్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్-సీడ్స్ పేస్ట్‌ను వేయాలి. ఉండలు కట్టకుండా గరిటెతో వెంటనే బాగా కలిపి లో-మీడియం మంటపై 4-5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం కమ్మని సువాసనతో క్రీమీగా దగ్గరపడుతుంది. చిన్న పాన్‌లో 1 టీస్పూన్ నెయ్యి వేడిచేసి సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు పలుకులను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

5 / 5
పాయసం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. వేడి కాస్త తగ్గి గోరువెచ్చగా అయ్యే వరకు 2 నిమిషాలు ఆగి, కరిగించిన బెల్లం నీటిని టీ జల్లెడతో వడకడుతూ పోసి కలపాలి. ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్, పావు టీస్పూన్ యాలకుల పొడి వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే బలవర్ధకమైన 'హెల్దీ ఎనర్జీ డ్రింక్ / పాయసం' సిద్ధం! ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా లేదా ఈవెనింగ్ స్నాక్‌గా ఒక కప్పు తాగితే శరీరానికి అద్భుతమైన సత్తువ చేకూరి, రోజంతా నూతనోత్సాహాన్ని అందిస్తుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us