అద్భుతం: రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తింటే ఏమవుతుందో తెలుసా?

Updated on: Jul 24, 2025 | 8:22 AM

పుష్కలమైన పోషకాలతో నిండివున్న పండు ఖర్జూరం. అందుకే ఇవి ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు చెబుతుంటారు. అయితే.. వీటిని నేరుగా కాకుండా..నానబెట్టి తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం పండ్లు సహజ స్వీటెనర్‌గా పనిచేస్తాయి. అంతేకాదు.. శక్తివంతమైన ఆహారం. ఇందులో ఉండే సహజ చక్కెరలైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్‌లు వ్యాయామం తర్వాత తక్షణ శక్తిని అందిస్తాయి. నానబెట్టిన ఖర్జూరాలు తినటం వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
ఖర్జూరంలో ఉండే సేంద్రీయ సల్ఫర్ కాలానుగుణ అలెర్జీలను నివారించడంలో సహాయపడుతుంది. ఖర్జూరలోని కరిగే, కరగని ఫైబర్స్, అమైనో ఆమ్లాలు.. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.  రక్తహీనత ఉన్నవారు ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా మంచిది. నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల నుంచి కాపాడుతుంది.

2 / 5
ఖర్జూరంలో సెలీనియం, మాంగనీస్, రాగి, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. ఖర్జూరాల్లోని ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించి కణాలను రక్షిస్తాయి. దీనితో పాటు ఇనుము, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉండటంతో హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల తేలికగా జీర్ణమవుతాయి.

3 / 5
ఖర్జూరంలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. ఖర్జూరంలో లభించే కాల్షియం ఎముకలను బలపరుస్తుంది.

4 / 5
ఖర్జూరాలు శరీరంలో రక్త ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. అవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడతాయి. అందువల్ల ప్రతిరోజూ ఓ ఖర్జూరం పండు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, శక్తి  లభిస్తాయి. ఖర్జూరంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5 / 5
dates

dates