
ఇడ్లీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక చాలా మంది ఎక్కువగా తెలుపు రంగు ఇడ్లీ మాత్రమే తింటారు. మరి కొంత మంది మిల్లెట్స్, మరికొందరు రాగి ఇడ్లీని చాలా ఇష్టంగా తింటారు. ఇక మరి ప్రతి సారి ఇవే తింటే కూడా బోర్ కొడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఇలాంటి ఇడ్లీలు తినాలనిపించదు.

మరి ఇలా రోజూ తినే రోటీన్ ఇడ్లీ కాకండా ఇలా బ్లాక్ ఇడ్లీలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. కాగా, ఇప్పుడు మనం ఆ నలుపు రంగు ఇడ్లీలను ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. వాటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : నల్ల సగ్గు బియ్యం, మినప్పు, మెంతులు.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా రెండు కప్పుల బియ్యం, ఒక కప్పు మినప్పు, టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టాలి. అచ్చం దోశ పిండిలా నాన బెట్టి మరసటి రోజు మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిని పులియ బెట్టాలి. మరసటి రోజు ఇడ్లీ పాత్రలో వేసి ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ నలుపు రంగు ఇడ్లీలు రెడీ.

దీనితో ఇడ్లీ మాత్రమే కాకుండా దోశలు కూడా వేసుకోవచ్చును. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది. వైరల్ ఫీవర్స్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అన్ని విధాలుగా ఇది మీకు చాలా మేలు చేస్తుందంట.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, నిపుణుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. కేవలం ఇడ్లీ తింటేనే విష జ్వరాలు తగ్గుతాయని ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి, వైద్య నిపుణుల సహాయంతో మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఇది కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది.