
ఎక్కడికి వెళ్ళకుండా హనుమాన్ జయంతి రోజున ఇంట్లోనే స్వీట్ బూందీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. శనగపిండి, పంచదార పాకంలో చేస్తే రుచి అదిరిపోతోంది. పండుగల సమయంలో ఇదే ఉత్తమమైనది. మరి, దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

స్వీట్ బూందీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు శనగపిండి , రెండు కప్పుల పంచదార, రెండు కప్పుల నీరు, ఒక కప్పు నూనె లేదా నెయ్యి వేయించడానికి, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పులు, 10 ఎండుద్రాక్షలు, ఫుడ్ కలర్ కూడా తీసుకోవాలి.

స్వీట్ బూందీని ఎలా తయారు చేయాలంటే.. ముందుగా శనగపిండిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి, ఉండలు లేకుండా దోసెల పిండి;లాగా దీనిని బాగా కలుపుకోవాలి. మరి జోరుగా కాకుండా కంటే కొంచెం పలుచుగా కలుపుకోవాలి.

బూందీని ఇలా వేయించుకోవాలి.. గ్యాస్ స్టవ్ వెలిగించి ఆయిల్ చేసి, అది వేడయ్యాక ఒక గరిటెను తీసుకుని పిండిని నూనెలో వేసి, సన్నని మంటపై గోల్డ్ కలర్లోకి మారే వరకు బాగా వేయించి, వాటిని తీసుకోవాలి.

ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని పంచదార వేసి దానిలో కొద్దిగా నీరు పోసి పాకం లాగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. ఆ తర్వాత దీనిలో యాలకుల పొడి వేయి బూందీకి పట్టించి మూడు గంటలు దీనిని పక్కన పెట్టుకోవాలి. అంతే, వేడి వేడి నే స్వీట్ బూందీ రెడీ.