ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు గుత్తి వంకాయ కూర ఇలా చేస్తే వదిలిపెట్టకుండా తింటారు

Updated on: Oct 21, 2026 | 1:34 PM

చుట్టాలు వచ్చినప్పుడు రుచికరమైన గుత్తి వంకాయ కర్రీని ఇంట్లోనే తయారు చేసుకోండి. అన్నంలోకి ఎంతో అద్భుతంగా ఉండే ఈ మసాలా వంకాయ కూరను ఇంట్లోనే చేయవచ్చు. మసాలాలతో నింపిన వంకాయలను ఉడికించి, చిక్కటి గ్రేవీతో వస్తుంది. ఇది భోజనానికి మంచి టేస్టీ రెసిపీ.

1 / 5

ముందుగా ఒక పాన్లో మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి దోరగా వేయించాలి. పల్లీలు వేగాక, రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక టీ స్పూన్ షాజీరా, ఒక టీ స్పూన్ జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, నాలుగు లవంగాలు, రెండు అంగుళాల దాల్చినచెక్క, రెండు యాలుకలు, కొద్దిగా కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్‌లో మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. దినుసులు వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

2 / 5

వేయించిన దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిలో అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల కారం, ఒక టీ స్పూన్ గరం మసాలా, రెండు అంగుళాల అల్లం, పది వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుతూ గట్టి పేస్ట్‌గా మిక్సీ చేసుకోవాలి. ఈ మసాలాను ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.

3 / 5

అరకిలో వంకాయలను తీసుకొని, వాటిని కాడతో పాటు నాలుగు భాగాలుగా మధ్య వరకు కట్ చేసుకోవాలి. కింది భాగం విడిపోకుండా చూసుకోవాలి. సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్‌ను ఈ వంకాయల మధ్య నిండుగా స్టఫ్ చేసుకోవాలి. అన్ని వంకాయలను ఇలా నింపి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద పాన్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి.

4 / 5
నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేగిన తర్వాత, మసాలా నింపిన వంకాయలను పాన్లో జాగ్రత్తగా పేర్చుకోవాలి. మూత పెట్టి ఐదు నిమిషాలు తక్కువ మంటపై మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత వంకాయలను మెల్లగా మరోవైపు తిప్పి, మళ్లీ మూతపెట్టి బాగా మగ్గనివ్వాలి.

5 / 5
వంకాయలు బాగా మగ్గిన తర్వాత, మిగిలిన మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసి, వంకాయలు చిదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం, ఒక గ్లాస్ నీళ్లు, రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి. మూత పెట్టి, మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి, ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా, పావు కప్పు కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us