
ఉదయం టిఫిన్ ఏం చేయాలా అనే టెన్షన్ చాలా మందిలో ఉంటుంది. అయితే ఎప్పుడూ తినే దోశ, ఇడ్లీ , పూరీ కాకుండా కాస్త కొత్తగా ట్రై చేయాలి అనుకునే వారికి ఈ గుంత పొంగనాలు చాలా బెటర్. దోశ పిండితోనే సులభంగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చును. అంతే కాకుండా ఇవి రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. దీనిని కేవలం నిమిషాల్లోనే చేయవచ్చును.

గుంత పొంగనాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెల్లితే .. దోస పిండి – 1 కప్పు, ఉల్లిపాయ – 1 (చిన్న ముక్కలుగా తరిగినవి), పచ్చిమిర్చి – 4 (సన్నగా తరిగినవి), క్యారెట్ – 1 (తురిమినది), ఉప్పు – తగినంత, నూనె – 1 టేబుల్ స్పూన్ (పొంగనాల పాన్.

తయారీలోకి వెళ్లితే.. ముందుగా, ఒక పెద్ద గిన్నెలో దోస పిండిని తీసుకోండి. అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తురిమిన క్యారెట్, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు, స్టవ్ వెలిగించి గుంత పొంగనాల పాన్‌ను వేడి చేయాలి. పాన్‌లోని అన్ని గుంతలలో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక, సిద్ధం చేసుకున్న పిండిని ఒక స్పూన్ సహాయంతో ప్రతి గుంతలో వేసుకోవాలి.

తరువాత, పాన్‌పై మూత పెట్టి ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి, పొంగనాలను నెమ్మదిగా తిప్పుకోవాలి. మరో రెండు నిమిషాల పాటు గోధుమ రంగు వచ్చేవరకు ఉడికించాలి. పొంగనాలు బంగారు రంగులోకి మారి, చక్కగా కాలిన తర్వాత, వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.

అంతే టేస్టీ టేస్టీ , వేడివేడి గుంత పొంగనాలు రెడీ. వీటిని మీకు నచ్చిన చట్నీతో కలిపి సర్వ్ చేసుకోవచ్చు. ఈ రుచికరమైన, మెత్తటి పొంగనాలు కేవలం పది నిమిషాల్లో సిద్ధమవుతాయి. అంతే కాకుండా రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు.