FD Interest Rates: SBI కస్టమర్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంపు.. ఎంతంటే?

Updated on: Mar 24, 2026 | 9:40 AM

SBI Hikes FD Interest Rates: తన కస్టమర్లకు స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డు డిపాజిట్లపై వడ్డిరేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. కాబట్టి ఏ టెన్యూర్‌ డిపాజిట్లపై ఎంత మేర వడ్డీ రేట్లు పెరిగాయో తెలుసుకుందాం పదండి

1 / 5
బ్యాంక్‌లో ఫిక్స్‌ డిపాజిట్లు చేసి కస్టమర్లకు స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్న తరుణంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  అనూహ్యంగా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు పేర్కొంది. రూ. 3 కోట్ల కంటే ఎక్కువ ఉండే బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు పేర్కొంది. సవరించిన ఈ కొత్త వడ్డీ రేట్లు మార్చి 15, 2026 నుండి అమల్లోకి వచ్చాయని బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

2 / 5
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్య వినియోగదారుల కోసం ఎంపిక చేసిన టెన్యూర్ డిపాజిట్లపై ఎఫ్‌డీ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచినట్లు తెలిపింది. 46 రోజుల నుండి 179 రోజులు మధ్య మెచ్చూర్ అయ్యే డిపాజిట్ల వడ్డీ రేటు 5.10శాతం నుండి 5.35శాతానికి, 180 రోజుల నుండి ఏడాది లోపు డిపాజిట్ల వడ్డీ రేటు 5.60 శాతం నుండి 5.85 శాతానికి, ఏడాది నుండి రెండేళ్ల లోపు వడ్డీ రేటు 6.25 శాతం నుండి 6.50శాతానికి పెంచినట్టు పేర్కొంది.

3 / 5
అయితే సాధారణ కస్టమర్ల కంటే సీనియర్ సిటిజన్లకు ఎప్పుడూ అదనపు వడ్డీ రేట్లు అందనున్నాయి. పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలనుకునే వారికి ఈ పెంపు మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక సీనియర్ సిటిజన్ల కోసం సవరించిన FD వడ్డీ రేట్ల విషయానికి వస్తే 46 రోజుల నుండి 179 రోజులు టెన్యూర్ బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.60 శాతం నుండి 5.85శాతాని ఎస్‌బీఐకి పెంచింది. 180 రోజుల నుండి ఏడాది లోపు డిపాజిట్లపై వడ్డీ రేటు 6.10 శాతం నుండి 6.35 శాతానికి పెరగ్గా ఒక సంవత్సరం నుండి రెండేళ్ల లోపు డిపాజిట్ల 6.75 శాతం  నుండి 7.00 శాతానికి పెరిగాయి..

4 / 5
అయితే బ్యాంక్ తాజాగా సవరించిన వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లకు, మెచ్యూర్ అయ్యాక రెన్యువల్ చేసిన డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. రిటైల్, బల్క్ టర్మ్ డిపాజిట్లకు  మిగిలిన అన్ని నిబంధనలు, షరతులు యథాతథంగా వర్తిస్తాయని తెలిపారు.

5 / 5
అయితే బల్క్ టర్మ్ డిపాజిట్లను గడువుకు ముందే విత్‌డ్రా చేసుకుంటే విధించే 1శాతం పెనాల్టి ఉంటుందని, కొత్త డిపాజిట్ దారులతో పాటు రెన్యువల్ చేసుకున్న డిపాజిట్లకు సైతం ఇది వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. అంటే, ఒక కస్టమర్ మెచ్యూరిటీ కాలానికి ముందే డిపాజిట్‌ను విత్‌డ్రా చేసుకోవాలని నిర్ణయించుకుంటే, చెల్లించాల్సిన వడ్డీ రేటు వర్తించే రేటు నుండి 1శాతం తగ్గించబడుతుంది.

Follow Us