
గోంద్ లడ్డూలు మన తెలుగు వారికి తెలియదు వీటి గురించి. కానీ, చాలా చోట్లా వీటిని చేసుకుని తింటారు. వానాకాలం, శీతాకాలంలో తయారు చేసుకునే పోషకాహారంగా చెబుతారు. ఈ లడ్డూల రెసిపీని గోంద్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి కలిపి చేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి, లేట్ చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

గోంద్ లడ్డూల రెసిపీకి కావాల్సిన పదార్థాలు: అర కప్పు గోంద్, ఒక కప్పు గోధుమ పిండి, అర కప్పు నెయ్యి , ఒక కప్పు బెల్లం పొడి, పావు కప్పు బాదం, పావు కప్పు జీడిపప్పు , పావు కప్పు వాల్‌నట్స్, పావు కప్పు ఎండు కొబ్బరి తురుము , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి. సరైన కొలతలతో చేస్తే టేస్టీగా ఉంటుంది.

గోంద్ లడ్డూల రెసిపీ తయారీ విధానం: ముందుగా పాన్ కొద్దిగా నెయ్యి వేసి అది బాగా వేడయ్యాక మీడియం మంటపై దీనిని వేయించాలి; ఇంకా కొద్దిగా పొంగిన తర్వాత కొద్దీ సేపు చల్లార్చాలి మొత్తం చల్లగా అయినా తరవాత ఈ గోంద్‌ను మిక్సీలో వేసి కొద్దిగా పొడిలాగా చేసుకోవాలి. ఇక ఇప్పుడు అదే పాన్ లో డ్రై ఫ్రూట్స్‌ను కూడా వేసి వేయించాలి.

గోంద్ లడ్డూల రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేసి గోధుమ పిండిని కూడా దీనిలో వేసి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇక ఆ తర్వాత దీనిలో వేయించిన గోంద్, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి కూడా వేసి కలపాలి. ఇది చల్లారిన తర్వాత బెల్లం కలపాలి. ఆ తరవాత చేతికి ఆయిల్ రాసుకుని లడ్డూలుగా చేసుకోవాలి.

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)