Gold Price: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. భారీగా తగ్గిన బంగారం, వెండి.. తులంపై ఎంతంటే?

Updated on: Nov 25, 2026 | 12:01 PM

Gold Silver Price Today in Hyderabad: బంగారం కొనే వారికి ఇది అదిరిపోయే శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే నవంబర్ 25, బుధవారం నాడు బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. ఏకంగా ఈ ఒక్కరోజే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,220 తగ్గింది. ఇక వెండి ధర కేజీపై రూ.10 వేలు దిగొచ్చింది.

1 / 5
పసిడి ప్రియులకు బంగారం, వెండి ధరలు భారీ ఊరట కల్పించాయి. బుధవారం ఒక్క రోజే బంగారంపై రూ.3 వేలకు పైగా, వెండిపై రూ.10 వేలకు పైగా ధరలు తగ్గాయి. దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,24,580కి పడిపోయింది.

2 / 5
ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,24,580గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,200కి పడిపోయింది. సాధారణంగా ప్రజలు ఎక్కువగా కొనే ఆభరణాల తయారీలో 22 క్యారెట్ల బంగారాన్ని వాడుతారు కాబట్టి, ప్రస్తుతం రూ.1.14 లక్షలకు తులం బంగారం లభించనుంది.

3 / 5
ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.1,65,000 ఉండగా, నిన్న ఈ ధర రూ.1,75,000గా ఉంది. అంటే ఒక్క రోజులోనే కేజీ వెండిపై రూ.10 వేల వరకు తగ్గింది.

4 / 5
అయితే బంగారం ధరలు ఒక్కసారిగా ఇలా తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచబోతోందనే అంచనాలే. దీనికి తోడు డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్స్ పెరగడం కూడా ఇందుకు కారణం కావచ్చు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్టర్లు బంగారాన్ని విక్రయించడం కూడా ధరలపై ఒత్తిడి తెచ్చింది.

5 / 5
అయితే ధర తగ్గింది కదా అని చాలా మంది ఎగబడి గోల్డ్ షాపులకు వెళ్లి బంగారం కొంటుంటారు. కానీ మీరు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మోసపోవడం ఖాయం. కాబట్టి బంగారం కొనే ముందు అది స్వచ్ఛమైనదా కాదా అని నిర్ధారించుకోండి. BIS హాల్‌మార్క్, HUID గుర్తింపు సంఖ్య ఉన్నాయో లేవో తప్పకుండా చెక్ చేసుకోండి.

Loading...
Unable to load recommendations.
Follow Us