Delhi Flyover: నీట్ అండ్ క్లిన్‌గా దేశ రాజధాని.. ఢిల్లీ ఫ్లైఓవర్ గోడలపై గీతా సారంతో సహా అందమైన చిత్రాలు..

|

Jun 26, 2023 | 11:05 AM

దేశ రాజధాని రహదారులు అందంగా ముస్తాబవుతున్నాయి. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ రోడ్లను అందంగా తీర్చిదిద్దేందుకు వివిధ ఫ్లై ఓవర్ల గోడలపై కుడ్యచిత్రాలను రూపొందించింది. ఈ కుడ్యచిత్రాల ద్వారా MCD హిందువుల పవిత్ర గ్రంథం గీతా సారాన్ని సాధారణ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసింది. 

1 / 6
దేశ రాజధాని హస్తినను ప్రభుత్వం అందంగా ముస్తాబు చేస్తోంది. అంతేకాదు నగరం చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. దీంతో ఢిల్లీ నగరం నీట్ గా, క్లీన్ గా కనిపించడమే కాదు చాలా అందంగా కనిపించేలా చూపించాలని భావిస్తోంది.   

2 / 6
ఢిల్లీ ప్రభుత్వం.. నగరంలోని మునిసిపల్ కార్పొరేషన్ రోడ్లను శుభ్రం చేస్తోంది. అంతేకాదు రోడ్లకు ఆనుకుని ఉన్న గోడలపై కుడ్యచిత్రాలను రూపొందించడం ప్రారంభించింది. ఈ క్రమంలో ముందుగా అన్ని ఫ్లై ఓవర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల గోడలపై కుడ్యచిత్రాలను రూపొందిస్తున్నారు.

3 / 6
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ ఈ గోడలపై వేసే మ్యూరల్ పెయింటింగ్స్ ఎంపికలో ప్రత్యేక దృష్టి సారించింది.  దేశంలోని నాగరికత, సంస్కృతికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా భగవద్గీతను.. గీతా సారాన్ని తెలిపే విధంగా చిత్రాలను గోడలపై చిత్రీకరిస్తున్నారు. ఇందులో శ్రీకృష్ణుడి వివిధ రూపాలను చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది.

4 / 6
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా వాల్ పెయింటింగ్స్‌లో భాగంగా శ్రీ కృష్ణుడి వివిధ రూపాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అంతేకాదు బుద్ధుడు, మహా వీరుడు సందేశాలను కూడా తెలిపే విధంగా గోడలపై చిత్రీకరించనున్నారు.   

5 / 6
ఓ వైపు పురాణాలు, సంస్కృతి, సంప్రదాయాన్ని మరోవైపు ఆధునిక భారతదేశ చిత్రాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది ఢిల్లీ సర్కార్. ఈ క్రమంలో డీజిల్ లోకోమోటివ్ రైళ్లను చూపించగా.. మరోవైపు భారత్ రైలు వేగంగా పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తోంది.  

6 / 6
ద్వాపర యుగంలో పాండవుల రాజధాని ఇంద్రప్రస్థం కాలక్రమంలో ఢిల్లీగా మారిందని నమ్మకం. ఈ నేపథ్యంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఈ కుడ్యచిత్రాల ద్వారా పురాతన నగర విశిష్టతను, అద్భుతమైన చరిత్రను తెలియజేసే విధంగా ఢిల్లీ ప్రభుత్వం చెప్పడానికి ప్రయత్నించింది.