
అల్లం దోశ ఎలా చేస్తారా అని ఆలోచిస్తున్నారా? ఇది భారతీయ వంటకాల్లో ఒక ప్రత్యేకమైన వంటకం. దీనిని ఉదయాన్నే తింటే ఎంతో మంచిది ఇంకా ఆరోగ్యకరమైన అల్పాహారాం కూడా. ఘాటైన అల్లం దోశకు కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఈ రెసిపీ అల్లం పచ్చడితో చేస్తారు ఇది పోషక విలువలతో నిండి ఉంటుంది, ఇంకా ఇది జీర్ణక్రియకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అలాగే, శరీరానికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇది అందిస్తుంది. అందుకే, ఇప్పటికి ఎంతో మంది అల్లం దోశను తినడానికి ఇష్టం చూపిస్తారు.

అల్లం దోశకు కావాల్సిన పదార్థాలు : రెండు కప్పులు దోశ పిండి , ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు , 2 పచ్చిమిర్చి తరుగు, రెండు టేబుల్ స్పూన్స్ ఉల్లిపాయ తరుగు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా దీనిలో తగినంత నూనె ఇంకా నెయ్యిను తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా తీసుకోవాలి.

దోశ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, ఇంకా సన్నగా తరిగిన అల్లం, 4 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయ తరుగు కూడా వేసి కలపండి. ఇప్పుడు పెనం మీద కొంచం ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక కొద్దిగా ఆయిల్ రాయండి. ఆ తర్వాత గరిటెతో పిండి వేసి పలుచగా వేసి తిప్పండి. అంచుల వెంట కొద్దిగా నెయ్యి వేసి, రెండు వైపులా బాగా కాల్చండి.

సాధారణంగా చేసే దోశల మాదిరిగానే, ఈ అల్లం దోశకు అల్లం ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఈ రెసిపీని మీ ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా ఇంట్లోనే సులభంగా అల్లం దోశను తయారు చేయవచ్చు. ఈ అద్భుతమైన అల్లం దోశను తయారుచేసి, వానలు పడేటప్పుడు ఇది తినొచ్చు. ఆరోగ్యకరమైన అల్పాహారం కోసం ఇది ఒక గొప్ప ఎంపిక.