
మిల్లెట్స్ ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనితో పలావ్ చేసి తింటారు. దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, రుచికి మాత్రమే కాకుండా బలం కూడా. మీరు ఈ రెసిపీని ఒక్కసారి తింటే రుచి అదిరిపోద్ది. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్దాలు ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఈ రెసిపీని చాలా మంది కొర్రలతో చేసి తింటారు. ఎందుకంటే, దీనిలో మన శరీరానికి కావాల్సిన ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ వంటకంలో మిల్లెట్స్, కూరగాయలు వేస్తారు. దోస , ఇడ్లీ కన్నా కూడా ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కి కూడా ఇది పర్ఫెక్ట్. తక్కువ నీరుతో చేయాలి ఇలా చేస్తే నెక్స్ట్ లెవెల్

కావాల్సిన పదార్దాలు : 150 గ్రాములు కొర్రలు, ఐదు బిర్యానీ ఆకులు, 4 లవంగం, 5 యాలకులు, కట్ చేసిన ఉల్లిపాయలు ముక్కలు , సగం తుంచిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ , సగం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఉప్పు, కారం, నూనెను తీసుకోవాలి.

ఈ కొర్రలు పులావ్ ను ఎలా చేయాలంటే? మీరు ఒక కప్పు కొర్రలను తీసుకుని వాటిని ఒకటికి రెండు సార్లు కడిగి ఒక గంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత గ్యాస్ పొయ్యి వెలిగించి కుక్కర్‌లో కొద్దిగా నూనె వేసి అది వేడయ్యాక దాచిన చెక్క, లవంగం, నాలుగు యాలకులు, మసాలాలు కూడా వేసి బాగా వేయించాలి.

కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన కొర్రలను ను కుక్కర్లో వేసి రెండు గ్లాస్ ల నీళ్లు పోసి సరిపడా ఉప్పు కూడా వేసి టేస్ట్ చూసి మూత పెట్టాలి. ఇప్పుడు దీనిలో మీడియం మంటపై ఉంచి 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేసి దించుకోవాలి