Fig Water : అంజీర్ నీరు చర్మానికి వరం..! ఉదయాన్నే ఖాళీకడుపుతో తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా..?

|

Aug 02, 2024 | 7:32 PM

అంజీర్ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంజీర్‌నే కాదు అంజీర్ నానబెట్టిన నీటిని తాగటం వల్ల చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంజీర్ నీరు మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. ముఖం మీద తరచూ ఏర్పడే మొటిమలు, మచ్చలను తొలగించాలని ప్రయత్నిస్తున్నవారు మాత్రం ఖచ్చితంగా అంజీర్‌ నీటిని ఉపయోగించాలంటున్నారు నిపుణులు. అంజీర్ నీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎన్ని లాభాలో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5
అంజీర్ నీరు చర్మానికి వరం అంటున్నారు నిపుణులు. ఈ ప్రత్యేకమైన వస్తువును ప్రతిరోజూ రాత్రి ముఖానికి రాసుకుంటే వారంలో తేడాను గమనించవచ్చు అంటున్నారు నిపుణులు.  క్రమం తప్పకుండా ఇది ట్రై చేస్తూ ఉంటే.. మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.

2 / 5
ముఖాన్ని మెరిసేలా, అందంగా మార్చుకోవాలనే ఆందోళన ఉంటే అంజీర్ నీటిని ఉపయోగించవచ్చు. అత్తి పండ్లు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందుకోసం 2, 3 అత్తి పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం లేచిన తర్వాత స్ప్రే బాటిల్‌లో అంజీర్‌ నీటిని నింపాలి. ఇప్పుడు ఈ నీటిని ముఖంపై స్ప్రే చేయాలి. తరువాత  కాటన్ బాల్ సహాయంతో అంజీర్ నీటిని ముఖం మొత్తానికి బాగా పూయాలి. ఈ నీటిని మెడపై కూడా రాసుకోవచ్చు.

3 / 5
ముఖంపై 10 నుంచి 15 నిమిషాల పాటు అంజీర్ నీటిని అప్లై చేసి వదిలేయండి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. అంజీర్ నీటిని ఉపయోగించే ముందు పాచ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలి.  ఎందుకంటే కొంతమందికి దద్దుర్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
అత్తి పండ్లలో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర నీటిని తాగడం వల్ల అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. అంటున్నారు నిపుణులు. రోజూ అంజీర్‌ నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. మలబద్ధకం సమస్య ఉండదు. అంజీర్ నీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

5 / 5
అంజీర్‌ నీటిని తాగడం వల్ల ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా ఉంటుంది. అందువల్ల ఇది బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.  ఖాళీ కడుపుతో అంజీర్ నీటిని తాగడం వల్ల స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. షుగర్ పేషెంట్లు కూడా దీన్ని తమ దినచర్యలో చేర్చుకోవచ్చు. ఎందుకంటే శరీరంలో షుగర్ లెవెల్ త్వరగా పెరగకుండా చేస్తుంది.