Facial Hair Removal Tips: నొప్పి లేకుండా ముఖంపై అవాంచిత రోమాలు తొలగించడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Updated on: Feb 01, 2024 | 12:40 PM

ఆకృతైన కనుబొమ్మలు కావాలంటే బ్యూటీ పార్లర్‌కి వెళ్లి థ్రెడింగ్ చేయించుకోవాలి. అయితే థ్రెడింగ్ తర్వాత కనుబొమ్మల వద్ద చర్మంపై దద్దుర్లు వస్తాయి. అయితే థ్రెడింగ్ లేకుండా అవాంఛిత రోమాలను తొలగించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో ఫేస్ వ్యాక్సింగ్, రేజర్ల వాడకం బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే వ్యాక్సింగ్ కూడా బాధాకరమైనది. అలాగని రేజర్ ఉపయోగిస్తే, చర్మంపై గాయాలు అయ్యే అవకాశం ఉంది. ముఖంపై మొటిమలు ఉంటే రేజర్ ఉపయోగించకపోవడమే మంచిది..

1 / 5
ఆకృతైన కనుబొమ్మలు కావాలంటే బ్యూటీ పార్లర్‌కి వెళ్లి థ్రెడింగ్ చేయించుకోవాలి. అయితే థ్రెడింగ్ తర్వాత కనుబొమ్మల వద్ద చర్మంపై దద్దుర్లు వస్తాయి. అయితే థ్రెడింగ్ లేకుండా అవాంఛిత రోమాలను తొలగించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో ఫేస్ వ్యాక్సింగ్, రేజర్ల వాడకం బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే వ్యాక్సింగ్ కూడా బాధాకరమైనది. అలాగని రేజర్ ఉపయోగిస్తే, చర్మంపై గాయాలు అయ్యే అవకాశం ఉంది. ముఖంపై మొటిమలు ఉంటే రేజర్ ఉపయోగించకపోవడమే మంచిది.

2 / 5
థ్రెడింగ్, వాక్సింగ్, రేజర్‌లకు బదులుగా అవాంఛిత ముఖ రోమాలను సహజ పద్ధతిలో తొలగించవచ్చు. పెదవులపైన, బుగ్గలు, కనుబొమ్మలపై అవాంఛిత రోమాలను తొలగించడానికి ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. ఇది ఎలాంటి నొప్పి లేకుండా జుట్టును తొలగిస్తుంది. చర్మం కూడా బాగుంటుంది. దీనిని ఎలా తయారు చేస్తారంటే..

3 / 5
పసుపులో పాలు లేదా నీళ్లు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై వెంట్రుకలు ఉన్న చోట అప్లై చేయాలి. పేస్ట్ ఆరిన తర్వాత దానిని చేతులతో రుద్దాలి. ఈ ట్రిక్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల అన్‌వాంటెడ్‌ జుట్టు తగ్గుతుంది.

4 / 5
బేసన్‌లో రోజ్ వాటర్‌ కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత స్క్రబ్ చేసి ముఖం కడుక్కోవాలి. శనగ పిండి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.రోజ్ వాటర్ చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది.

5 / 5
పండిన బొప్పాయిని మిక్సీలో పేస్ట్ చేసి, అందులో చిటికెడు పసుపు కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, మసాజ్ చేసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. దాంతో చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే ఒక చెంచా పంచదారతో నిమ్మరసం మిక్స్ చేసి ఫేస్ స్క్రబ్ తయారు చేసుకోవాలి. ఈ ఫేస్ స్క్రబ్‌ని ముఖంపై వృత్తాకారంలో రుద్దాలి. నిమ్మరసం సహజమైన స్కిన్ బ్లీచ్‌గా పనిచేస్తుంది. చక్కెర చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది.