
సాయంత్రం వేళల్లో చాలా మంది ఈ పేదోళ్ల ఫేవరెట్ నాన్ వెజ్ మిక్చర్ తింటుంటారు. ఇంకా వీటిని జోరు వానల్లో తింటే నీరసం కూడా పరార్ ఆవుతుంది. పల్లెటూర్లలో పిల్లలకు ఇదే ఎక్కువ పెడుతుంటారు. ఇది ఆరోగ్యానికి బలం కూడా. ఇది అంత రుచిగా ఉంటుంది. మరి, లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

ఎగ్ ఎగ్ బజ్జీ మిక్చర్ కు కావలసిన పదార్థాలు: 4 కోడిగుడ్లు , ఒక కప్పు శనగపిండి , మూడు టేబుల్ స్పూన్స్ బియ్యప్పిండి, ఒక టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు , అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు , నాలుగు కరివేపాకు రెమ్మలు, 4 పచ్చిమిర్చి , ఒక ఉల్లిపాయ , అర టీ స్పూన్ చాట్ మసాలా, సరిపోను నూనెను తీసుకోవాలి.

ముందుగా కోడి గుడ్లను ఉడికించి వాటి పొట్టు తీసి ఇంకా రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఒక గిన్నెలో కొద్దిగా శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండి, కొద్దిగా కారం, ఇంకా పసుపు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో నీరు పోసి బజ్జీ పిండి మాదిరి చేసుకోవాలి.

ఇక ఇప్పుడు దీనిలో ఉడికించిన కోడి గుడ్లను ఈ పిండిలో వేసి , ఇప్పుడు నూనెలో రంగు మారే వరకు దీనిని వేయించుకోవాలి. అలాగే, ఈ వేయించిన ఎగ్ బజ్జీలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే నూనెలో కొంచం కరివేపాకు, 10 పచ్చిమిర్చి కూడా వేయించి వీటిని పక్కన పెట్టుకోవాలి.

ఇక ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో నాలుగు ఎగ్ బజ్జీ ముక్కలు, ఇంకా రెండు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి దీనిని బాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో చాట్ మసాలా, కారం చల్లి బాగా దీనిని మిక్స్ చేయాలి. అలాగే, ఇంకా దీనిలో నిమ్మరసం కూడా పిండితే పుల్ల పుల్లగా ఉంటుంది