చర్మాన్ని తెల్లగా మార్చే ఇంటి చిట్కాలు.. ఇలా చేస్తే అప్సరసంత అందం మీ సొంతం..!

Updated on: May 26, 2025 | 9:15 AM

అందంగా, నలుగురిలో ఆకర్షణీయంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టి ఏవేవో బ్యూటీ ప్రొడక్ట్స్‌ వాడుతుంటారు. బ్యూటీ పార్లర్ల చుట్టూ పరుగులు తీస్తుంటారు. కానీ, సౌందర్యపోషణ పట్ల ఎక్కువగా శ్రద్ధపెట్టారు. అయితే, కాస్త ఓపిక, శ్రద్ధ పెట్టగలిగితే ఇంట్లోని వస్తువులతోనే మరింతగా మెరిసిపోవడం సాధ్యమవుతుందని మీకు తెలుసా..? చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా మార్చుకునేందుకు ఈ ఇంటి చిట్కాలు అద్భుతం చేస్తాయి. వీటని ఫాలో అయ్యారంటే.. త్వరలోనే మీ చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చుతాయి.

1 / 5
పెసర పిండి, పాలు: పెసర పిండిలో చిటికెడు పసుపు వేసి కొద్దిగా చల్లని పాలు పోసుకుని బాగా కలుపుకోవాలి..ఇది చిక్కటి పేస్టులాగా తయారవుతుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముఖానికి ఆలివ్ నునే లేదా నువ్వుల నునే పట్టించి రెండు నిమిషాలు మర్దన చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రాసుకుని ఒక పావు గంట ఉంచుకుని ఆరాక చల్లని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి రెండు సార్లు చేస్తూ ఉంటే.. మృదువైన, తెల్లని చర్మాన్ని పొందవచ్చు.

2 / 5
పుదీనా రసం: 
పుదీనా రసాన్ని ముఖానికి రాయడం వల్ల ముఖం అందంగా, ప్రకాశవంతంగా మారుతుంది. పుదీనా ఆకులను మెత్తగా నూరి అందులో కొంచెం పసుపు వేసి కలపండి. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగిన తర్వాత ఆ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. దాంతో మీ ముఖం మృదువుగా మారుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారు ఈ ప్యాక్‌ అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

పుదీనా రసం: పుదీనా రసాన్ని ముఖానికి రాయడం వల్ల ముఖం అందంగా, ప్రకాశవంతంగా మారుతుంది. పుదీనా ఆకులను మెత్తగా నూరి అందులో కొంచెం పసుపు వేసి కలపండి. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగిన తర్వాత ఆ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. దాంతో మీ ముఖం మృదువుగా మారుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారు ఈ ప్యాక్‌ అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

3 / 5
వరిపిండి, టమాటా రసం: వరిపిండిలో టమాటా రసాన్ని కలిపి పేస్ట్‌ తయారు చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల మృతకణాలు తొలగుతాయి. ఈ ప్యాక్‌ అప్లై చేస్తే స్కిన్‌ టోన్‌ బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు అప్లై చేయండి. దీన్ని 15 - 20 నిమిషాల పాటు ఆరనిచ్చి.. చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే.. కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

4 / 5
తేనె, నిమ్మరసం: తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాస్తే చర్మానికి ఎంతో మంచిది. తేనె, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి గుణాలు చర్మానికి యాంటీ ఏజింగ్ లక్షణాలు అందిస్తాయి. చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఈ ప్యాక్ చర్మంపై ముడతలు, గీతలను దూరం చేస్తుంది. క్రమం తప్పకుండా తరచూ ఇలా చేస్తూ ఉంటే.. త్వరలోనే మీ చర్మం తెల్లగా మారుతుంది. అయితే, సెన్సిటివ్‌ స్కిన్‌ ఉన్నవారు జాగ్రత్త వహించండి.

5 / 5
కీరదోస రసం
చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవడం కోసం కీరదోసతో రకరకాల ఫేస్‌ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా కీరదోస, అలోవెరా జెల్‌తో తయారు చేసుకునే ఫేస్‌ప్యాక్‌ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి , విటమిన్ బి ఉన్నాయి. ఇవి చర్మానికి సమృద్ధిగా పోషణను అందిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. కీరదోస రసాన్ని ముఖానికి రాయడం వల్ల స్కిన్ టోన్ బాగుంటుంది. కీరదోస రసం అప్లై చేస్తే చర్మం కూల్‌ అవుతుంది.

కీరదోస రసం చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవడం కోసం కీరదోసతో రకరకాల ఫేస్‌ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా కీరదోస, అలోవెరా జెల్‌తో తయారు చేసుకునే ఫేస్‌ప్యాక్‌ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి , విటమిన్ బి ఉన్నాయి. ఇవి చర్మానికి సమృద్ధిగా పోషణను అందిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. కీరదోస రసాన్ని ముఖానికి రాయడం వల్ల స్కిన్ టోన్ బాగుంటుంది. కీరదోస రసం అప్లై చేస్తే చర్మం కూల్‌ అవుతుంది.