
పిల్లల ఆరోగ్యం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు. అయితే పిల్లు ఇష్టంగా తినాలి, పోషకాలు పుష్కలంగా అందాలి అంటే, ఎగ్ కూరగాయల శాండ్ విచ్ చాలా బెస్ట్. ఇది కేవలం నిమిషాల్లోనే తయారు చేయవచ్చును. అంతే కాకుండా మీ పిల్లలు కూడా దీనిని చాలా ఇష్టంగా తింటారు.

ఎగ్ శాండ్ విచ్ తయారీ కోసం కావాల్సిన పదార్థాలు : ఎగ్స్ నాలుగు, బ్రెడ్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఆవాలు, ఉల్లికాడలు, నల్లమిరియాలపొడి, రుచికి సరిప ఉప్పు, వెన్న , బంగాళ దుంప చిప్స్.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా కోడి గుడ్లు తీసుకోవాలి. వీటిని మంచిగా ఉడకబెట్టి , వాటిపై పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్నగా కట్ చేసి, ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో క్యాప్సికం, మయోనైజ్, ఆవాల పేస్ట్, ఉల్లికాడల ఆకులు చిన్నగా కట్ చేసినవి, మిరియాల పొడి, ఉప్పు, అన్నీ వేసి, ఎగ్స్‌తో మంచిగా కలుపుకోవాలి.

ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకోవాలి. వాటిని సరైన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వాటిపై వెన్నె పూయాలి. తర్వాత మీరు మందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమం తీసుకొని, బ్రెడ్ ముక్కలపై సమానంగా పూయాలి. ఇలా సరిగ్గా పూయడం వలన రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

అంతే కాకుండా, మీరు బ్రెడ్ పై సరిగ్గా ఎగ్ మిశ్రం వేసిన తర్వాత, శాండ్ విచ్‌లను సరైన ఆకారంలో కట్ చేయాలి. తర్వాత వాటిని మీ పిల్లల లంచ్ బాక్స్‌లో పెట్టాలి. వాటితో పాటు పొటాటో చిప్స్ కూడా పెట్టడం వలన మీ పిల్లలు ఇష్టంగా తింటారు.