ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగుతున్నారా? ఈ లాభాలు తెలిస్తే అవునా.. నిజమా అంటూ నోరెళ్ల బెడతారు..!

Updated on: Apr 04, 2026 | 9:10 AM

మనం రోజూ చేసే చిన్న చిన్న అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. అందులో ఒకటి ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగడం. అయితే, చాలామంది బ్రష్ చేసిన తర్వాతే నీళ్లు తాగుతుంటారు. కానీ నిద్రలేవగానే నోరు కడుక్కోకుండా నీళ్లు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన మేలు జరుగుతుందని మీకు తెలుసా..? అవును బ్రష్ చేయకముందే నీళ్లు తాగడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం, ఆధునిక వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: మనం నిద్రపోతున్నప్పుడు నోటిలో ఉత్పత్తి అయ్యే లాలాజలంలో ఎన్నో ఎంజైమ్స్ ఉంటాయి. బ్రష్ చేయకుండా నీళ్లు తాగినప్పుడు ఈ లాలాజలం కడుపులోకి చేరుతుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణం కావడానికి, కడుపులో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేయడానికి తోడ్పడుతుంది.

2 / 5
 రోగనిరోధక శక్తి (Immunity): ఈ అలవాటు వల్ల శరీరంలోని వ్యర్థాలు త్వరగా బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది.

3 / 5
చర్మం, జుట్టు ఆరోగ్యం: శరీరంలో నీటి శాతం పెరగడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇది మొటిమలను తగ్గించి, చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. అలాగే జుట్టు కుదుళ్లు దృఢంగా మారి జుట్టు రాలడం తగ్గుతుంది.

4 / 5
 రక్తపోటు నియంత్రణ: ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది అధిక రక్తపోటు (High BP), మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. పరగడుపున నీళ్లు తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇది శరీరంలోని అనవసర కేలరీలను కరిగించడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

5 / 5
ముఖ్యమైన విషయం ఏంటంటే.. వీలైనంత వరకు గోరువెచ్చని నీటిని తాగడానికి ప్రయత్నించండి. నీళ్లు తాగిన తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు ఏమీ తినకూడదు. ఆ తర్వాతే బ్రష్ చేసి అల్పాహారం తీసుకోవాలి. ఆరోగ్యం కోసం మనం చేసే ఈ చిన్న ప్రయత్నం దీర్ఘకాలంలో మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. రేపటి నుండి మీరు కూడా ఈ అలవాటును ప్రారంభించండి!

Follow Us