
మనం ఏం చేయకుండానే కొన్నిసార్లు పాలు వేడిచేయగానే ఇవి విరిగిపోతాయి. అప్పుడు వెంటనే ఈ పాలను ఏం చేసుకోవాలంటూ వీటిని పారబోస్తారు. అలా కాకుండా అమ్మమ్మల నాటి చిట్కాలు తెలుసుకుని వీటితో రుచికరమైన వంటకాలు చేయోచ్చు. మరి అసలు లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

స్వీట్‌కోవా కూడా తయారు చేసుకోవచ్చు: అయితే, ఇంకా ఈ పాలను పారపోయకుండా వీటిలో కొంచం ఎగ్ కలిపి దీనిని మెత్తగా, మృదువుగా చేయాలి. ఇంకా దీనితో మీరు ఎంచక్కా స్వీట్‌కోవా తయారు చేసుకుని తియ్య తియ్యగా తినొచ్చు అంత రుచికరంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి.

జున్నును ఇలా చేయోచ్చు: పాలు విరిగాయని మీకు తెలిసిన వెంటనే వీటిని పక్కన పెట్టేయాలి. అయితే, దీనిలో అందులో కొంచెం పంచదార వేసి కలుపుకొని తింటే జున్నులా ఎంత తియ్యగా ఉంటుందో.. చాలా మంది ఇది తినడానికి ఇష్ట పడతారు కాబట్టి, ఈ సారి మీరు కూడా దీనిని చేయడానికి చుడండి. మీకు పక్కాగా నచ్చుతుంది.

మనకి తెలియని ఇంకో రెసిపీ ఏంటంటే ఈ విరిగిన పాలను తీసుకుని దీనితో కూర చేసుకుని తినొచ్చు. తాలింపు కూర లాగా చేసుకుని తింటారు. అయితే దీనిని పడని వారు ఇలాంటిది తినకపోవడమే మంచిది. (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

విరిగిన పాలను పడేయకుండా దీనిలో కొంచెం పసుపు వేసుకుంటే ఇది పులుసులా ఉంటుంది. ఇంకా విరిగిన పాలను పూలకుండీలో పోస్తే మొక్కలకు కూడా ఇది చాలా బలం. ఇంకా దీనిలో ఉండే క్యాల్షియం మొక్కలను విడిపోకుండా బలంగా చేస్తుంది. ఈ ఎరువు టమాటా మొక్కలకు చాలా మంచిది.