Eggshell fertilizer: అరెరే గుడ్డు పెంకులను ఇలా కూడా వాడొచ్చా.. ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం అబ్బా!

Updated on: Oct 30, 2026 | 6:59 PM

సాధారణంగా చాలా మంది కోడిగుడ్లు వాడిన తర్వాత వాటి పెంకులు దేనికి పనికిరావని.. వాటిని వేస్ట్‌గా డస్ట్‌బిన్‌లో పడేస్తుంటారు. కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే.. ఇకపై మీరు అస్సలూ వాటిని పడేయరు. అవును కోడిగుడ్ల పెంకులతో మీ పెరట్లోని మొక్కలకు రసాయనాలు లేని ఎరువును అందించవచ్చట. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
కోడిగుడ్డు పెంకును చాలా మంది వేస్ట్‌గా పడేస్తుంటారు. కానీ అవి మొక్కల పెరుగుదలతో కీలక పాత్ర పోషిస్తాయని చాలా మందికి తెలియదు. ఖరీదైన రసాయన ఎరువులు వాడే కన్నా.. కోడిగుడ్డు పెంకులను సేంద్రియ ఎరువుగా మార్చి వాడడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. కోడిగుడ్డు పెంకుల్లో మొక్కలకు అవసరమైన కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మొక్కలు వేగంగా, ఆరోగ్యంగా పెరగడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

2 / 5
అయితే,గుడ్డు పెంకులను పొడిగా చేసి నేరుగా మొక్క మొదట్లోని మట్టిలో వేయడం చాలా మంది చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల రిజల్ట్‌ త్వరగా రాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కోడి గుడ్డు పెంకులను వెనిగర్‌లో కలిపి లిక్విడ్ ఎరువుగా మార్చాలి. ఈ లిక్విడ్ ఎరువు తయారు చేయడం కూడా చాలా సులభం. అదెలా చేయాలో ఇక్కడ చూద్దాం.

3 / 5
లిక్విడ్ ఎరువు తయారీ కోసం 5-6 శుభ్రమైన, ఎండిన గుడ్డు పెంకులు, వెనిగర్ అవసరం. ముందుగా గుడ్డు పెంకులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఈ ముక్కలను ఒక గాజు జార్‌లో వేయండి. పెంకులు పూర్తిగా మునిగేంత వరకు ఆ జార్‌లో వెనిగర్ పోయండి. వెనిగర్ పోయగానే బుడగలు, నురుగు వస్తాయి. ఈ మిశ్రమాన్ని సుమారు 48 గంటలు అలాగే ఉంచండి. ఈ సమయంలో పెంకులు కరిగి, వాటిలోని కాల్షియం ద్రవంలోకి చేరుతుంది.

4 / 5
రెండు రోజుల తర్వాత పెంకులు బాగా మెత్తబడతాయి. అప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక జల్లెడ సాయంతో వడకట్టుకోండి. ఇలా ఏర్పడి ద్రవ ఎరువును ఒక జార్‌లో తీసి పక్కన పెట్టుకొండి. అయితే ఈ ద్రావణాన్ని నేరుగా మొక్కలకు పోయరాదు. దీన్ని మొక్కలకు వేసే ముందు నీటిలో కలిపి పలుచగా చేయాలి. అంటే ఒక లీటరు నీటిలో సుమారు 5 మిల్లీలీటర్ల ద్రావణాన్ని మాత్రమే కలపాలి.

5 / 5
తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మొక్క మొదట్లో మట్టిలో పోయాలి. ఎదిగిన పూలు, పండ్ల మొక్కలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే, కేవలం ఈ ద్రావణం పోసినంత మాత్రాన పూలు, కాయలు రాలిపోకుండా ఉంటాయని చెప్పలేం. కాబట్టి మొక్కలు ఆరోగ్యంగా ఎదగడానికి కాల్షియంతో పాటు సరైన ఎండ, తగినంత నీరు, సారవంతమైన మట్టి, ఇతర పోషకాలు కూడా ఎంతో అవసరం. కాబట్టి అన్ని సరిగ్గా ఉండేలా చూసుకోండి.

Loading...
Unable to load recommendations.
Follow Us