
మనం కిచెన్‌లో కాఫీ తయారు చేసేందుకు ఉపయోగించే ఫిల్టర్ పేపర్లను కారు శుభ్రం చేసేందుకు వాడొచ్చు.వీటికి దుమ్మును ఈజీగా పీల్చుకునే స్వాభావం ఉంటుంది. వీటి నుంచి సాధారణ బట్టల మాదిరిగా నూలు పోగులు రాలవు. వీటితో తుడిచినప్పుడు ఎలాంటి గీతలు కూడా పడవు. ఎలాంటి క్లీనింగ్ లిక్విడ్ ఉపయోగించకుండానే పొడి దుమ్మును ఇది సులభంగా తొలగిస్తుంది.

దీన్ని ఎలా వాడాలి అంటే ముందుగా శుభ్రమైన, పొడిగా ఉన్న కాఫీ ఫిల్టర్ పేపర్‌ను తీసుకోవాలి. మైక్రోఫైబర్ క్లాత్‌తో తుడిచినట్లుగానే డ్యాష్‌బోర్డ్‌పై సున్నితంగా తుడవాలి. ఫిల్టర్‌పై దుమ్ము ఎక్కువగా పేరుకుపోతే దాన్ని తీసేసి కొత్తది ఉపయోగించాలి. కొన్ని కాఫీ ఫిల్టర్లను కారులోని గ్లోవ్ కంపార్ట్‌మెంట్‌లో ఉంచుకుంటే అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవచ్చు.

ఈ కాఫీ ఫిల్టర్లతో కారు డ్యాష్‌బోర్డ్, ముందు ప్యానెల్, సెంటర్ కన్సోల్ వంటి సున్నితమైన ప్రాంతాలను శుభ్రం చేయవచ్చు. అంతేకాకుండా డోర్ ప్యానెల్స్, గేర్ పరిసర ప్రాంతాలు, హార్డ్ ప్లాస్టిక్, వినైల్ ఉపరితలాలపై పేరుకుపోయిన సన్నని దుమ్మును కూడా తొలగించవచ్చు. కారు అద్దాలను శుభ్రం చేసేందుకు కూడా కొందరు వీటిని ఉపయోగిస్తారు. దీంతో అద్దాలపై నూలు పోగులు మిగిలే సమస్య తగ్గుతుంది.

కారులోని ఎయిర్ వెంట్లలో దుమ్ము ఎక్కువగా పేరుకుపోతే. వాటిలో ఉండే సన్నని ఖాళీలను కాఫీ ఫిల్టర్‌తో నేరుగా శుభ్రం చేయడం కష్టంగా ఉంటుంది. అందుకే ముందుగా మెత్తటి చిన్న బ్రష్ లేదా కంప్రెస్డ్ ఎయిర్‌తో దుమ్మును తొలగించాలి. ఆ తర్వాత ఎయిర్ వెంట్ల బయటిభాగాలను, చుట్టుపక్కల ప్రాంతాలను కాఫీ ఫిల్టర్‌తో సులభంగా తుడవవచ్చు.

అయితే కాఫీ ఫిల్టర్ పేపర్ వాడానికి కొన్ని లిమిట్స్ కూడా ఉన్నాయి. ఇది పేపర్‌తో తయారవుతుంది కాబట్టి నీరు తగిలితే త్వరగా చిరిగిపోయే చాన్స్ ఉంది. అలాగే జిడ్డు మరకలు, గ్రీజు, జిగురు వంటి వాటిని తొలగించడానికి ఇది పనికిరాదు. కాబట్టి దీని వాడే ముందు ఈ విషయాలు కచ్చితంగా గుర్తించుకోండి.