ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేరు!

Updated on: Dec 05, 2025 | 4:32 PM

most expensive fruits in the world: ప్రకృతిలో లభించే అనేక రకాలు పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా పరిగణించబడుతున్నాయి. దాంతో పాటు ఇవి ఎంతో రుచిగా కూడా ఉండడంతో వీటిని తినేందుకు జనాలు ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే చాలా రకాల పండ్లు సమాన్యులకు అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని మాత్రం అందని ద్రాక్షగా ఉన్నాయి. ఈ పండ్లు బంగారం కంటే ఖరీదైనవిగా అమ్ముడవుతాయి. ఇవి ఇంత ఖరీదైనవిగా పేరొందడానికి ప్రధాన కారణం వాటి ప్రత్యేక పెంపకం, ప్రయోజనాలు, ఉత్పత్తి పరిమితులు, బ్రాండింగ్. వీటిని కేవలం దనవంతులు మాత్రమే కొనవచ్చు. కాబట్టి ప్రపంచంతో అత్యంత ఖరీదైన టాప్-5 పండ్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
 యుబారి కింగ్ మెలోన్ : జపాన్‌లోని హొక్కైడోకు చెందిన యుబారి కింగ్ అనే పుచ్చకాయ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండుగా పేరొందింది. ఈ జాతికి చెందిన ఒక జత పుచ్చకాయల ధర $25,000 (సుమారు రూ. 22 లక్షలు) వరకు ఉంటుంది. ఈ పండు రుచికి చాలా స్వీట్‌గా ఉండడంతో పాటు ఎంతో సువాసనను కలిగి ఉంటుంది.

2 / 5
ద్రాక్షపై పేరుకుపోయిన రసాయనాలను తొలగించడంలో బేకింగ్ సోడా కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక లీటరు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలపాలి. ద్రాక్షను ఈ ద్రావణంలో 15 నిమిషాలు నానబెట్టాలి. ఈ బేకింగ్ సోడా పురుగుమందుల అవశేషాలను తగ్గించడంలో సహాయపడుతుంది. తర్వాత మంచినీటితో బాగా కడగితే సరి. నీటిలో వెనిగర్ కలిపి అందులో ద్రాక్షను నానబెట్టినా క్రిములను చంపడంలో, ఉపరితలంపై అంటుకున్న అవశేషాలను వదులుకోవడానికి సహాయపడుతుంది.

3 / 5
డెన్సుకే పుచ్చకాయ: ఇది కూడా జపాన్‌లో దొరికే ప్రపంలో అత్యంత ఖరీదైన పండ్డలో ఒకటి. ఈ అరుదైన నల్లటి చర్మం గల పుచ్చకాయ ధర దాదాపు $6,000( 5లక్షల 40వేల) వరకు ఉంటుంది. ఇవి వాటి రుచి, సువాసనకు ప్రత్యేకత కలిగినవి.    హొక్కైడోలో ప్రాంతంలో పండే ఈ పండు.. ప్రతి ఏటా కేవలం 100 నుండి 150 మాత్రమే ఉత్పత్తి అవుతాయి. అందుకనే వీటికి ఇంత డిమాండ్ ఉంటుంది.

4 / 5
బిజెమ్ దురియన్: థాయ్‌లాండ్‌కు చెందిన ఈ పండు కూడా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. దురియన్లలో రాజుగా పిలువబడే బిజెమ్ దురియన్ ధర $2,500( 2లక్షల 24 వేల) వరకు ఉంటుంది. ఇది ఎంతో రుచికంగా ఉండడంతో పాటు చాలా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతుంది. అందుకే ఈ పండుకు ఇంతలా డిమాండ్ ఉంది.

5 / 5
 హెలిగాన్ పైనాపిల్ యొక్క లాస్ట్ గార్డెన్స్: ఇంగ్లాండ్‌లోని కార్న్‌వాల్‌లోని ప్రత్యేక గ్రీన్‌హౌస్‌లో పండించిన ఈ పైనాపిల్ ధర $1,500 అంటే లక్షా 34వేల వరకు ఉంటుంది. ఈ ఒక పండు పెరగడానికి సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇది కూడా ప్రపంచంలోని ఖరీదైన పండ్లలో ఒకటిగా నిలిచింది.

Follow Us