Pappu Chekkalu: దీపావళి స్పెషల్.. 1kg పిండితో కరకరలాడే పప్పు చెక్కలు

Updated on: Nov 03, 2026 | 6:54 PM

తెలుగువారి పండుగ సంస్కృతిలో చెక్కలు  అత్యంత ప్రీతిపాత్రమైన పిండివంటకం. పిల్లల స్నాక్స్ బాక్స్‌లకైనా, సాయంత్రం వేడి టీతో నంజుకుని తినడానికైనా చెక్కల కంటే కరకరలాడే స్నాక్ మరొకటి ఉండదు. అయితే చాలామంది ఇంట్లో కేజీల కొద్దీ పిండితో చెక్కలు చేసినప్పుడు అవి గట్టిగా రాయిలా మారడం లేదా నూనె ఎక్కువగా పీల్చడం జరుగుతుంది. శ్రావణీస్ కిచెన్ అందించిన ఈ ఖచ్చితమైన కొలతలను పాటిస్తే బయట స్వీట్ షాపుల్లో కొన్నట్లే ప్రతి చెక్కా సూపర్ క్రిస్పీగా, రుచిగా వస్తుంది.

1 / 5
కావలసిన పదార్థాలు: 1 కేజీ పొడి బియ్యప్పిండి, 1 గంట నానబెట్టిన అర కప్పు శనగపప్పు, అర కప్పు పెసరపప్పు, 4 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, 2 నుండి 3 టేబుల్ స్పూన్ల  వెన్న, 2 టీస్పూన్ల కారం పొడి, 1½ నుండి 2 టీస్పూన్ల సాల్ట్, సన్నగా తరిగిన పిడికెడు కరివేపాకు, పిండి కలపడానికి తగినన్ని గోరువెచ్చని నీళ్లు, డీప్ ఫ్రైకి సరిపడా వంట నూనె మసాలా పేస్ట్ కోసం: పావు కప్పు ధనియాలు, 15 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 నుండి 7 పచ్చిమిరపకాయలు

2 / 5
తయారీ విధానం:  అర కప్పు శనగపప్పు, అర కప్పు పెసరపప్పును శుభ్రంగా కడిగి గిన్నెలో నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్‌లో పావు కప్పు ధనియాలు, 15 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6-7 పచ్చిమిర్చి వేసి నీళ్లు లేకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వెడల్పాటి బేసిన్‌లో 1 కేజీ పొడి బియ్యప్పిండిని తీసుకోవాలి. ఇందులో నానబెట్టిన శనగపప్పు, పెసరపప్పు , 4 టేబుల్ స్పూన్ల నువ్వులు, గ్రైండ్ చేసిన మసాలా ముద్ద, సన్నగా తరిగిన కరివేపాకు, 2 టీస్పూన్ల కారం, సరిపడా ఉప్పు మరియు 2-3 టేబుల్ స్పూన్ల వెన్న వేయాలి.

3 / 5
వెన్న, మసాలాలు పిండిలో పూర్తిగా కలిసేలా చేతులతో బాగా తిప్పాలి. ఇప్పుడు పిండిని కొద్దిగా టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో సరిచూసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లను పోస్తూ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్‌గా కలపాలి. పిండి ముద్దపై మూతపెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచాలి.10 నిమిషాల తర్వాత చేతులకు కొద్దిగా నూనె రాసుకుంటూ.. పిండిని నిమ్మకాయ సైజు బాల్స్‌లా చేసుకోవాలి. పిండి ఆరిపోకుండా ఒకేసారి 15-20 ఉండలు మాత్రమే చేసుకుని మిగిలిన పిండిపై మూతపెట్టి ఉంచాలి.

4 / 5
 పూరీ ప్రెస్ మిషన్‌పై పాలిథిన్ కవర్ లేదా బటర్ పేపర్ ఉంచి కొద్దిగా నూనె రాయాలి. మధ్యలో పిండి ముద్దను ఉంచి నెమ్మదిగా ఒత్తితే సమంగా, పల్చగా రౌండ్‌గా వస్తుంది.
ప్రెస్ లేకపోతే కవర్‌పై నూనె రాసి పిండి ముద్దను ఉంచి, పైన మరో కవర్ పెట్టి చపాతీ కర్రతో పల్చగా రోల్ చేసుకోవాలి. ఒత్తిన చెక్కలను ఒక కాటన్ క్లాత్‌పై వరుసగా పరుచుకోవాలి.

 పూరీ ప్రెస్ మిషన్‌పై పాలిథిన్ కవర్ లేదా బటర్ పేపర్ ఉంచి కొద్దిగా నూనె రాయాలి. మధ్యలో పిండి ముద్దను ఉంచి నెమ్మదిగా ఒత్తితే సమంగా, పల్చగా రౌండ్‌గా వస్తుంది. ప్రెస్ లేకపోతే కవర్‌పై నూనె రాసి పిండి ముద్దను ఉంచి, పైన మరో కవర్ పెట్టి చపాతీ కర్రతో పల్చగా రోల్ చేసుకోవాలి. ఒత్తిన చెక్కలను ఒక కాటన్ క్లాత్‌పై వరుసగా పరుచుకోవాలి.

5 / 5
కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడిచేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే చెక్కలను ఒక్కొక్కటిగా నూనెలోకి జార్చాలి. కడాయి సైజును బట్టి 3 నుండి 4 చెక్కలను వేసి.. మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించి జల్లిగరిటెతో తీయాలి. అంతే, నోరూరించే కరకరలాడే సంప్రదాయ 'పప్పు చెక్కలు' సిద్ధం! చేత్తో తుంచితే టక్కున విరుగుతూ, నోట్లో వేస్తే పప్పులు, నువ్వులు, వెల్లుల్లి సువాసనతో కరకరలాడుతూ 20 రోజుల పాటు గాలి చొరబడని డబ్బాలో తాజాగా నిల్వ ఉంటాయి !

Loading...
Unable to load recommendations.
Follow Us