15 నిమిషాల్లో ఇంట్లోనే.. రెస్టారెంట్ స్టైల్ చిల్లీ సోయా డ్రై..! ఇలా చేస్తే మళ్లీ మళ్లీ తింటారు!

Updated on: Aug 27, 2026 | 7:29 PM

మీ ఇంట్లోనే రుచికరమైన, క్రిస్పీ రెస్టారెంట్ స్టైల్ చిల్లీ సోయా డ్రైను ఈ కింది విధంగా తయారు చేయండి. ఈ అధిక ప్రోటీన్ స్నాక్‌ను సులభమైన పద్ధతిలో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. దీనిని కేవలం 10 నుండి 15 నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు..

1 / 5
కావలసిన పదార్థాలు.. 100 గ్రాములు సోయా చంక్స్, 1/2 ఆకుపచ్చ క్యాప్సికమ్, 1/2 పసుపు క్యాప్సికమ్, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 4 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత, 1 టీస్పూన్ తరిగిన వెల్లుల్లి, 1 టీస్పూన్ తరిగిన అల్లం, 2 టీస్పూన్లు చిల్లీ పేస్ట్/సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టీస్పూన్ అరోమాట్ పౌడర్, స్ప్రింగ్ ఆనియన్.. చొప్పున తీసుకోవాలి.

2 / 5
ముందుగా ఒక పాత్రలో నీటిని మరిగించి, అందులో కొద్దిగా ఉప్పు, 100 గ్రాముల సోయా చంక్స్‌ను వేయాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మంటను ఆపివేసి, 10-15 నిమిషాల పాటు అదే నీటిలో నానబెట్టాలి. దీనివల్ల సోయా చంక్స్ మెత్తగా, ఉప్పు రుచిని బాగా పీల్చుకుంటాయి. నానబెట్టిన తర్వాత, నీటిని పూర్తిగా వడకట్టి, చల్లారిన తర్వాత వాటిలోని నీటిని కొద్దిగా పిండాలి (పూర్తిగా పిండకూడదు). ఒక పెద్ద ఉల్లిపాయను, పచ్చిమిర్చిని పొడవుగా లేదా డైమండ్ కట్‌తో కట్ చేసుకోవాలి. మూడు రకాల క్యాప్సికమ్ (ఆకుపచ్చ, పసుపు, ఎరుపు - అందుబాటులో ఉంటే) ముక్కలను కూడా ఉల్లిపాయల మాదిరిగానే కట్ చేయాలి. కూరగాయలు కొద్దిగా పెద్దవిగా ఉండేలా చూసుకోవాలి.

3 / 5
మెత్తబడిన సోయా చంక్స్‌లో అర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ అరోమాట్ పౌడర్, అర టీస్పూన్ దంచిన మిరియాల పొడి, ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీస్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ (లేదా కాశ్మీరీ మిరప పొడి) వేసి చేతితో బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల మసాలాలు సోయా చంక్స్‌కు బాగా పడతాయి. ఆ తర్వాత, కార్న్ ఫ్లోర్‌ను కొద్ది కొద్దిగా చల్లుతూ, సోయా చంక్స్‌కు బాగా పట్టేలా కలపాలి. కార్న్ ఫ్లోర్ కోటింగ్ వల్ల సోయా చంక్స్ క్రిస్పీగా వేగుతాయి, నూనెను పీల్చకుండా ఉంటాయి.

4 / 5
నూనెను మీడియం నుండి హై ఫ్లేమ్‌లో వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, మ్యారినేట్ చేసిన సోయా చంక్స్‌ను బాణలిలో పట్టేన్ని ఒకేసారి వేయాలి. హై ఫ్లేమ్‌లో 3 నుండి 4 నిమిషాల పాటు వేయించాలి. అవి బంగారు రంగులోకి మారి, క్రిస్పీగా మారిన తర్వాత, నూనె నుంచి తీసి, టిష్యూ పేపర్‌పై ఉంచాలి. దీనివల్ల అదనపు నూనె పీల్చుకుంటుంది. ఒక స్టెయిన్‌లెస్ స్టీల్ చైనీస్ వోక్‌లో రెండు పెద్ద చెంచాల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కగానే, ఒక టీస్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, ఒక టీస్పూన్ సన్నగా తరిగిన అల్లం వేసి మీడియం ఫ్లేమ్‌లో వేయించాలి. అల్లం, వెల్లుల్లి సువాసన వచ్చిన తర్వాత, ఉల్లిపాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్‌లో ఉల్లిపాయలోని తేమ పోయే వరకు వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు వేసి 30-40 సెకన్లు హై ఫ్లేమ్‌లో వేయించాలి. కూరగాయలు మరీ మెత్తబడకుండా, కొద్దిగా కరకరలాడే గుణం ఉండేలా చూసుకోవాలి.

5 / 5
తర్వాత, ఒక టీస్పూన్ నిండా చిల్లీ పేస్ట్ (లేదా రెడ్ చిల్లీ సాస్), ఒక పెద్ద చెంచా డార్క్ సోయా సాస్ వేసి కొద్దిసేపు వేయించాలి. సుమారు ఒక కప్పు నీళ్లు పోయాలి (డ్రై కావాలంటే తక్కువ నీళ్లు). ఒక పెద్ద చెంచా టొమాటో సాస్, రెండు చిన్న చెంచాల వెనిగర్, అర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ అరోమాట్ పౌడర్ వేసి హై ఫ్లేమ్‌లో సాస్‌ను ఉడికించాలి. సాస్‌ను కొద్దిగా చిక్కబరచడానికి, నీటిలో కలిపిన కొద్దిగా కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేయాలి. చివరిగా, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ వేయాలి. సాస్ సిద్ధమైన తర్వాత, వేయించిన సోయా చంక్స్‌ను సాస్‌లో వేసి, హై ఫ్లేమ్‌లో 20 నుండి 30 సెకన్ల పాటు బాగా కలపాలి. సోయా చంక్స్‌కు సాస్ బాగా పట్టేలా చూసుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేస్తే రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ చిల్లీ సోయా డ్రై సిద్ధం.

Loading...
Unable to load recommendations.
Follow Us