WTC 2023-25: 9 జట్లు 68 టెస్టు మ్యాచ్‌లు.. డబ్ల్యూటీసీ 3వ ఎడిషన్ షురూ.. టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఫైనల్ ఎక్కడంటే?

|

Jun 15, 2023 | 8:01 PM

World Test Championship 2023-25: ఐసీసీ విడుదల చేసిన జాబితా ప్రకారం, తొమ్మిది జట్లు రెండేళ్లలో 27 సిరీస్‌లలో 68 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. దీంతో డబ్ల్యూటీసీ 3వ ఎడిషన్ పూర్తవ్వనుంది.

1 / 13
టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియా రెండో టెస్టు ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. దీంతో డబ్ల్యూటీసీ 2వ ఎడిషన్ ముగిసింది. ఇక తాజాగా 3వ ఎడిషన్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పోరు మొదలుకానుంది. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్‌తో ప్రారంభం కానుంది.

2 / 13
ఈ విధంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఇందులో ఈ ఎడిషన్‌లో ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు ఆడనుందో ప్రకటించింది. చివరిగా లార్డ్స్ మైదానంలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు టైటిల్ కోసం పోరాడుతాయి.

3 / 13
ఐసీసీ విడుదల చేసిన జాబితా ప్రకారం రెండేళ్లలో 9 జట్లు 27 సిరీస్‌ల్లో 68 టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి. టోర్నీ మూడో ఎడిషన్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు పాల్గొంటున్నాయి.

4 / 13
ప్రతి WTC సిరీస్‌లో ఒక జట్టు ఒక సిరీస్‌లో రెండు నుంచి ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతి ఉంటుంది. మొత్తంగా తొమ్మిది జట్లలో ఒక్కొక్కటి ఆరు సిరీస్‌లు ఆడనున్నాయి. వీటిలో మూడు సిరీస్‌లు స్వదేశంలో జరగనుండగా, మిగిలిన 3 సిరీస్‌లు విదేశాల్లో ఆడనున్నాయి.

5 / 13
2023 నుంచి 2025​ వరకు ఈ మూడో ఎడిషన్‌లో భారత్ 19 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో వెస్టిండీస్‌తో 2, దక్షిణాఫ్రికాతో 2, ఇంగ్లండ్‌తో 5, బంగ్లాదేశ్‌తో 2, న్యూజిలాండ్‌తో 3 టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి. చివరగా ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌తో భారత్ తన డబ్ల్యూటీసీ ఎడిషన్‌ 2023-25ను ముగించనుంది.

6 / 13
పాకిస్థాన్ జట్టు కూడా 14 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లు స్వదేశంలో తలపడనుండగా, ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు విదేశాల్లో తలపడనుంది.

7 / 13
డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ కూడా 19 మ్యాచ్‌లు ఆడనుంది. అందులో తొమ్మిది మ్యాచ్‌లు విదేశాల్లో, 10 మ్యాచ్‌లు స్వదేశంలో జరగనున్నాయి. ఇందుకోసం ఆసీస్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక దేశాల్లో పర్యటించనుండగా.. భారత్‌, పాకిస్థాన్‌, వెస్టిండీస్‌లతో సిరీస్‌లకు స్వదేశంలో ఆతిథ్యమివ్వనుంది.

8 / 13
బంగ్లాదేశ్ కూడా 12 మ్యాచ్‌లు ఆడుతుంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక సిరస్‌లకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. భారత్, వెస్టిండీస్, పాకిస్థాన్‌లలో పర్యటించనుంది.

9 / 13
ఇంగ్లండ్ 21 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. 10 స్వదేశంలో, 11 విదేశాలలో ఉండనున్నాయి. ఇది వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాలకు ఆతిథ్యం ఇస్తుంది. భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో సిరీస్‌లు ఆడేందుకు ఆయా దేశాలకు వెళ్లనుంది.

10 / 13
14 మ్యాచ్‌లు ఆడనున్న న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లతో తలపడనుంది.

11 / 13
దక్షిణాఫ్రికా 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. మూడు ఆసియా జట్లకు పాకిస్తాన్, శ్రీలంక, భారత్‌లతో సిరీస్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. అలాగే, న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లతో సిరీస్‌ల కోసం పర్యటించనుంది.

12 / 13
లంక 12 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లతో స్వదేశంలో, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో విదేశాల్లో తలపడుతుంది.

13 / 13
వెస్టిండీస్ 13 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో స్వదేశంలో భారత్, ఆఫ్రికా, బంగ్లాదేశ్ దేశాలతో స్వదేశంలో ఆడనుండగా.. ఆసీస్, ఇంగ్లాండ్, పాకిస్తాన్‌ దేశాల్లో పర్యటించనుంది.