Team India: విదేశీ లీగ్‌లపై కన్నేసిన మరో భారత ప్లేయర్.. రీఎంట్రీ కోసం తిప్పలు..

|

Jul 02, 2023 | 11:36 AM

Prithvi Shaw: ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఆడుతున్న పృథ్వీ టోర్నీ ముగిసిన తర్వాత నార్తాంప్టన్ షైర్ జట్టులో చేరనున్నాడని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఒకవేళ ఈ నివేదిక నిజమైతే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పృథ్వీ షా ఆడడం ఇదే తొలిసారి కానుంది.

1 / 6
County Cricket: ప్రస్తుతం టీమిండియాకు దూరమైన ఓపెనర్ పృథ్వీ షా.. విదేశీ లీగ్‌లవైపు వెళ్లనున్నాడని, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్తాంప్టన్‌షైర్ తరపున ఆడనున్నాడని సమాచారం వస్తోంది.

2 / 6
ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఆడుతున్న పృథ్వీ టోర్నీ ముగిసిన తర్వాత నార్తాంప్టన్ షైర్ జట్టులో చేరనున్నాడని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఒకవేళ ఈ నివేదిక నిజమైతే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పృథ్వీ షా ఆడడం ఇదే తొలిసారి కానుంది.

3 / 6
కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడతానని పృథ్వీ షా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, పృథ్వీ తిరిగి టీమిండియాలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని, అందుకే కౌంటీలో ఆడతాడని చెబుతున్నారు.

4 / 6
భారత్ నుంచి కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడిన తొలి వ్యక్తి పృథ్వీ షా కాదు. గతంలో బిషన్ సింగ్ బేడీ, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే వంటి భారత దిగ్గజాలు కూడా నార్తాంప్టన్‌షైర్ తరపున ఆడారు.

5 / 6
పృథ్వీ షా కెరీర్‌ను పరిశీలిస్తే.. ఇప్పటి వరకు టీమిండియా తరపున 6 వన్డేలు, 5 టెస్టులు ఆడాడు. 5 టెస్టు మ్యాచ్‌ల్లో 42.37 సగటుతో 339 పరుగులు చేసిన పృథ్వీ.. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.

6 / 6
ఇది కాకుండా టీమిండియా తరపున 6 వన్డేల్లో 31.50 సగటుతో 189 పరుగులు చేశాడు. పృథ్వీ షా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు, దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరపున ఆడుతున్నాడు.