
తొలిసారిగా జట్టుకు నాయకత్వం వహిస్తున్న రిషబ్ పంత్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. అయితే, తొలి మ్యాచ్‌లోనే ఓటమితో తన అంతర్జాతీ సారథ్యాన్ని రిషబ్ పంత్ ప్రారంభించాడు.

కేఎల్ రాహుల్ గత దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు వన్డేలు, ఒక టెస్టులో భారత జట్టుకు నాయకత్వం వహించాడు.

శిఖర్ ధావన్ గత ఏడాది శ్రీలంకలో జరిగిన మూడు వన్డేలు, మూడు టీ20 పర్యటనల్లో జట్టుకు నాయకత్వం వహించాడు.

నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టులో అజింక్య రహానే జట్టుకు నాయకత్వం వహించాడు.

టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌లో కెప్టెన్సీని వదులుకున్నాడు. ఆ తర్వాత కోహ్లీ వన్డే కెప్టెన్సీని కోల్పోయాడు.

2021 టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ రాజీనామా తర్వాత, టీ20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఆ తర్వాత వన్డే, టెస్టు జట్లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

ఏడాది వ్యవధిలో రిషబ్ పంత్ టీమ్ ఇండియాకు ఆరో కెప్టెన్‌గా నిలిచాడు. ఇందులో విశేషమేమిటంటే.. చాలా మంది కెప్టెన్లు రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లోనే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించారు.