18 బంతుల్లో అర్థ సెంచరీ.. ఒక ఓవర్‌‌లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌.. తుఫాన్ బ్యాటింగ్‌తో దడదడలాడించిన 20 ఏళ్ల బ్యాట్స్‌మెన్

|

Feb 18, 2022 | 6:25 AM

ఈ 20 ఏళ్ల పెషావర్ జల్మీ బ్యాట్స్‌మెన్ ఇదే సీజన్‌లో తన PSL అరంగేట్రం చేశాడు. ఆడుతోన్న మూడవ మ్యాచ్‌లోనే తుఫాను ఇన్నింగ్స్‌తో రికార్డ్ బుక్‌లో తన పేరును లిఖించుకున్నాడు.

1 / 4
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కొత్తగా వర్ధమాన ఆటగాళ్లు కూడా తమ సత్తా చాటుతున్నారు. పాకిస్థాన్ అండర్-19 క్రికెట్ జట్టులో స్టార్లలో ప్రస్తుతం 20 ఏళ్ల కొత్త బ్యాట్స్‌మెన్ కూడా చేరాడు. పెషావర్ జల్మీ ఓపెనర్ మహ్మద్ హారిస్ ఫిబ్రవరి 17, గురువారం ఇస్లామాబాద్ యునైటెడ్‌పై తుఫాను హాఫ్ సెంచరీని సాధించడం ద్వారా అనేక దిగ్గజాలను సమం చేశాడు. (ఫోటో: Twitter/PSL)

2 / 4
లాహోర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హారిస్ పెషావర్ జట్టుకు పవర్‌ప్లేలో అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. పీఎస్ఎల్ చరిత్రలో ఇది సంయుక్తంగా రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. కేవలం 17 బంతుల్లోనే ఈ ఫీట్‌ చేసిన కమ్రాన్‌ అక్మల్‌ పేరిట టోర్నీలో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ రికార్డు ఉంది. (ఫోటో: Twitter/PSL)

3 / 4
హరీస్ తన ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అదే ఓవర్‌లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు చేశాడు. హారిస్‌ ఈ ఆరంభం సాయంతో పెషావర్‌ కేవలం 6 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 74 పరుగులు చేసింది. అతను 32 బంతుల్లో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇందులో 12 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 పరుగులు వచ్చాయి. (ఫోటో: ట్విట్టర్/మొహమ్మద్ హరీస్)

4 / 4
ఈ యువ బ్యాట్స్‌మెన్ ఈ సీజన్‌లో తన PSL అరంగేట్రం చేశాడు. పెషావర్ కోసం పవర్‌ప్లేలో నిలకడగా పరుగులు చేస్తున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో, పవర్‌ప్లే సమయంలో కేవలం 23 బంతుల్లో 57 పరుగులు వచ్చాయి. పెషావర్‌తో అతనికి ఇది మూడో మ్యాచ్ మాత్రమే. (ఫోటో: Twitter/PSL)