IPL 2026: నాడు 715 సిక్సర్లతో బీభత్సం.. నేడు ఒక్క పరుగు చేయలేని దీనస్థితి.. ఆ చెత్త ప్లేయర్ ఎవరంటే?

Updated on: Apr 22, 2026 | 1:10 PM

Lucknow Super Giants: ఐపీఎల్ 2026 జోరుగా సాగుతోంది. కాగా లక్నో టీం ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడి కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఏకంగా పాయింట్ల పట్టికల్ 9వ స్థానంలో నిలిచింది. అయితే, కెప్టెన్ రిషబ్ పంత్‌తోొపాటు మరో ప్లేయర్ ఆ టీం పాలిట విలన్‌గా మారాడు.

1 / 5
Lucknow Super Giants: ప్రపంచ టీ20 క్రికెట్‌లో సిక్సర్ల సునామీ సృష్టించే కరీబియన్ వీరుడు నికోలస్ పూరన్, ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వేటలో తీవ్రంగా తడబడుతున్నాడు. తన కెరీర్‌లో వందల కొద్దీ భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టిన ఈ విధ్వంసకర బ్యాటర్, ఇప్పుడు ఒక్కో పరుగు కోసం నానా ఇబ్బందులు పడుతుండటం గమనార్హం. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు అతను ఇప్పుడు భారంగా మారాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2 / 5
నికోలస్ పూరన్ అంటేనే మైదానంలో సిక్సర్ల వర్షం. తన సుదీర్ఘ టీ20 కెరీర్‌లో 449 మ్యాచ్‌లు ఆడిన పూరన్, ఏకంగా 715 సిక్సర్లు బాదాడు. 147.32 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసే ఈ మొనగాడు, క్రీజులోకి వస్తే మ్యాచ్ ఫలితం తలకిందులు కావాల్సిందే. మొత్తం 10,422 పరుగుల భారీ రికార్డు ఉన్నప్పటికీ, ఐపీఎల్ 2026లో మాత్రం అతని మ్యాజిక్ పూర్తిగా మాయమైనట్లు కనిపిస్తోంది. పవర్‌ఫుల్ హిట్టర్‌గా పేరున్న పూరన్, ప్రస్తుత సీజన్‌లో తన నీడలా కూడా ఆడలేకపోతున్నాడు.

3 / 5
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన పూరన్, కేవలం 8.50 సగటుతో 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అత్యధిక స్కోరు కేవలం 19 పరుగులు మాత్రమే కావడం అతని ఫామ్ ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఎప్పుడూ 150కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఆడే పూరన్, ఈ ఏడాది కేవలం 79.69 వేగంతో పరుగులు చేస్తున్నాడు. ఇది ఒక విధ్వంసకర బ్యాటర్‌కు ఉండాల్సిన వేగం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ బ్యాటర్, ఇప్పుడు 6 మ్యాచ్‌లలో కేవలం 3 సిక్సర్లు, 2 ఫోర్లు మాత్రమే కొట్టడం గమనార్హం.

4 / 5
2025 ఐపీఎల్ సీజన్‌లో పూరన్ ఒక సంచలనం. ఆ ఏడాది 14 మ్యాచ్‌లలో 43.67 సగటుతో 524 పరుగులు చేశాడు. అప్పట్లో అతని స్ట్రైక్ రేట్ 196.25గా ఉండటంతో పాటు, ఏకంగా 40 సిక్సర్లు బాదాడు. ఆ ప్రదర్శన చూసి లక్నో యాజమాన్యం అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుని భారీ ధరకు అట్టిపెట్టుకుంది. కానీ, ఏడాది తిరిగేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో తాను సృష్టించిన రికార్డులకు భిన్నంగా, ఇప్పుడు జట్టుకు ఉపయోగపడని ఆటగాడిగా విమర్శలపాలవుతున్నాడు.

5 / 5
ఓవరాల్‌గా ఈ మెగా లీగ్ చరిత్రను పరిశీలిస్తే, పూరన్ ఇప్పటివరకు 96 మ్యాచ్‌లలో 32.10 సగటుతో 2344 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం మీద 164.95 స్ట్రైక్ రేట్‌తో ఆడే పూరన్, తన స్థాయికి తగ్గట్టుగా పుంజుకోవాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. లక్నో జట్టు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే, ఈ కరీబియన్ హిట్టర్ తన పాత ఫామ్‌ను అందిపుచ్చుకోవడం అత్యంత కీలకం.

Follow Us