IPL 2026: పవర్‌హౌస్ కాదు భయ్యో.. వీళ్లంతా కోల్‌కతా కంత్రీగాళ్లు.. ఏకంగా 4వ టైటిల్‌పై కన్నేశారుగా..!

Updated on: Mar 18, 2026 | 9:16 PM

KKR Squad 2026: ఐపీఎల్ 2026 సీజన్ సమరానికి తెరలేవనుంది. ఇప్పటికే మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఈసారి నాలుగో ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. స్టార్ ఆటగాళ్ల రాకతో జట్టు బలోపేతమైంది. ముఖ్యంగా ఐదుగురు కీలక ఆటగాళ్లు కేకేఆర్ జట్టుకు వెన్నెముకగా మారి, ప్రత్యర్థులకు వణుకు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

1 / 7
KKR Squad 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచింది. 2012, 2014, 2024లో టైటిల్స్ గెలిచిన ఈ జట్టు, ఇప్పుడు 2026 సీజన్‌లో సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. కొంతమంది కీలక ఫాస్ట్ బౌలర్లు దూరమైనప్పటికీ, జట్టులో ఉన్న ఐదుగురు మ్యాచ్ విన్నర్లు కేకేఆర్‌ను మళ్ళీ ఛాంపియన్‌గా నిలబెట్టగలరని విశ్లేషకులు భావిస్తున్నారు.

2 / 7
1. ఫిన్ అలెన్: కేకేఆర్ ఈసారి తన అమ్ములపొదిలో చేర్చుకున్న అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఫిన్ అలెన్. టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌లో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది చరిత్ర సృష్టించిన ఈ కివీస్ బ్యాటర్, ఐపీఎల్‌లో పరుగుల సునామీ సృష్టించేందుకు రెడీగా ఉన్నాడు. 176+ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసే అలెన్, పవర్‌ప్లేలో జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలకం కానున్నాడు.

3 / 7
2. కామెరాన్ గ్రీన్: రూ. 25.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ సొంతం చేసుకున్న కామెరాన్ గ్రీన్, జట్టులో అత్యంత కీలకమైన ఆల్‌రౌండర్. ఇటీవల షెఫీల్డ్ షీల్డ్‌లో సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన గ్రీన్, అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. ఐపీఎల్‌లో ఇప్పటికే మంచి సగటుతో పరుగులు సాధించిన ఇతను, మిడిల్ ఆర్డర్‌లో జట్టుకు కొండంత అండ.

4 / 7
3. సునీల్ నరైన్: దశాబ్ద కాలంగా కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సునీల్ నరైన్, ఈసారి కూడా జట్టుకు ప్రధాన అస్త్రం. ఓపెనింగ్‌లో మెరుపులు మెరిపించడమే కాకుండా, తన మిస్టరీ స్పిన్‌తో వికెట్లు తీయడంలో నరైన్ సిద్ధహస్తుడు. ఐపీఎల్‌లో 192 వికెట్లు తీసిన అనుభవం నరైన్ సొంతం.

5 / 7
4. వరుణ్ చక్రవర్తి: టీ20 వరల్డ్ కప్ విజయంలో భాగస్వామి అయిన వరుణ్ చక్రవర్తి, ఐపీఎల్‌లో కేకేఆర్ ప్రధాన స్పిన్నర్. మిడిల్ ఓవర్లలో పరుగులు నియంత్రించడంతో పాటు, కీలక వికెట్లు తీయడంలో వరుణ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్న ఇతను, ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలుగా మారనున్నాడు.

6 / 7
5. మతీషా పతిరాన: రూ. 18 కోట్లతో జట్టులోకి వచ్చిన పతిరాన, కేకేఆర్ బౌలింగ్ విభాగానికి కొత్త బలాన్ని ఇచ్చాడు. డెత్ ఓవర్లలో యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో ఇతను దిట్ట. ప్రస్తుతం ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నప్పటికీ, మైదానంలోకి దిగితే మాత్రం కేకేఆర్ బౌలింగ్ లైనప్ తిరుగులేకుండా ఉంటుంది.

7 / 7
కోల్‌కతా నైట్ రైడర్స్ బెస్ట్ ప్లేయింగ్ XI: అజింక్య రహానే, ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, మతీషా పతిరాన, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి.

Follow Us