MI vs RCB: దటీజ్ ముంబై vs బెంగళూరు మ్యాచ్.. రికార్డులకే దడ పుట్టించారుగా.. లిస్టు చూస్తే పరేషానే..

|

May 10, 2023 | 5:33 PM

RCBతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 83 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌తో సహా మొత్తం 5 అవార్డులు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సూర్య ఐపీఎల్‌లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా నమోదు చేశాడు.

1 / 7
ముంబై-ఆర్‌సీబీ మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఎన్నో పెద్ద రికార్డులు బద్దలయ్యాయి. ఈ మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎలాంటి రికార్డులు సృష్టించారో, బద్దలుకొట్టారో ఇప్పుడు చూద్దాం.

2 / 7
ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. సూర్య బ్యాట్‌ నుంచి 83 పరుగుల ఇన్నింగ్స్‌ వచ్చింది. అంతకుముందు ఐపీఎల్‌లో సూర్య అత్యధిక స్కోరు 82 పరుగులు.

3 / 7
ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సహా మొత్తం 5 అవార్డులు లభించాయి. ఈ అవార్డులన్నీ కలిపితే సూర్య ఏకంగా రూ.5 లక్షలు సంపాదించాడు.

4 / 7
ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మూడోసారి 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఒక సీజన్‌లో 3 సార్లు ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా ముంబై నిలిచింది. గతంలో 2014లో పంజాబ్‌, 2018లో చెన్నై రెండుసార్లు ఈ ఘనత సాధించాయి.

5 / 7
ఐపీఎల్‌లో అతి తక్కువ బంతుల్లో 200 పరుగులకు పైగా పరుగులు చేసిన జట్టుగా ముంబై నిలిచింది. ఈ మ్యాచ్‌లో ముంబై మరో 21 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అంతకుముందు 2017లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 15 బంతులు మిగిలి ఉండగానే 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

6 / 7
ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌లో 3000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో పాటు ఐపీఎల్‌లో సూర్య 100 సిక్సర్లు కూడా పూర్తి చేశాడు.

7 / 7
ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా రోహిత్ శర్మ వరుసగా 5 ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌లో ఔటై పెవిలియన్‌కు చేరుకున్నాడు. అంతకుముందు 2017 సీజన్‌లో రోహిత్ వరుసగా 4 ఇన్నింగ్స్‌లలో ఇలా సింగిల్ డిజిట్‌లో పెవిలియన్ చేరాడు.