
నాగ్‌పూర్‌లో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతాడని, 2019 నుంచి టెస్టుల్లో సెంచరీల కరువుకు ఫుల్‌స్టాప్ పెడతాడని అంతా భావించారు. కానీ అది జరగలేదు. కేవలం 12 పరుగులకే ఔటయ్యాడు. దీంతో ఏ బ్యాట్స్‌మెన్‌కూ నచ్చని రికార్డులో విరాట్ కోహ్లీ చేరిపోయాడు. దీంతో విరాట్‌ని ఆ విషయంలో వీక్‌నెస్ అని పిలుస్తున్నారు.

లియాన్ ఇచ్చిన క్యాచ్ పట్టడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ చేరాడు. విశేషమేమిటంటే.. టీమిండియా తరఫున రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ మాత్రమే ఇలా 300 ఇంటర్నేషనల్ క్యాచ్‌లు పట్టిన ఘనత సాధించాడు.

Sachin Tendulkar

రెండో స్థానంలో ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే, బంగ్లాదేశ్‌కు చెందిన మహముదుల్లా, భారత్‌కు చెందిన మహ్మద్ అజారుద్దీన్‌లు అరంగేట్రం బౌలర్‌లో తలో 23 సార్లు ఔట్ అయ్యారు.

డెస్మండ్ హేన్స్ అరంగేట్రం చేసిన బౌలర్ల చేతిలో 22 సార్లు, ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్ 21 సార్లు అరంగేట్రం బౌలర్‌లో ఔట్ అయ్యారు. ఆ తర్వాత తలో 20 టెస్టుల్లో అరంగేట్రం బౌలర్లలో స్టీవ్ వా, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్.లక్ష్మణ్ ఔటయ్యారు.