బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య 2023 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ జరుగుతోంది. ఈ క్రమంలో పవర్ ప్లేలో దంచి కొట్టిన టీమిండియా 1 వికెట్ నష్టపోయి 89 పరుగులు చేసింది.
అయితే, 29 బంతుల్లో 47 పరుగులు చేసి కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. టిమ్ సౌథీకి బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ చేతికి చిక్కాడు. వన్డే పవర్‌ప్లేలో టిమ్ సౌతీ ఐదోసారి రోహిత్‌ను అవుట్ చేశాడు.
శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ 50 బంతుల్లో 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
కాగా, టిమ్ సౌతీ అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మను 12వ సారి అవుట్ చేశాడు.
ఇలా చేయడం ద్వారా, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సందర్భాల్లో రోహిత్‌ను అవుట్ చేసిన దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ రికార్డును సౌతీ సమం చేశాడు.