
శ్రేయస్ అయ్యర్ క్రికెట్ కెరీర్‌లో 2022 సంవత్సరం మరుపురాని ఏడాదిగా మిగిలిపోనుంది. ఈ సంవత్సరం అతని బ్యాట్ నుంచి పరుగులు వెల్లువలా వచ్చాయి. టెస్టు.. వన్డే, టీ20. ఇలా మూడు ఫార్మాట్లలోనూ అదరగొట్టాడు అయ్యర్.

ఈ యంగ్ ప్లేయర్ ఈ ఏడాది మూడు ఫార్మాట్‌లలో కలిపి మొత్తం 1609 పరుగులు చేశాడు. తద్వారా 2022లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

అయ్యర్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 1424 పరుగులతో రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ 1329 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు

తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో అయ్యర్ మొత్తం 116 పరుగులు చేశాడు. దీంతో ఈ ఏడాది టెస్టుల్లో మొత్తం 422 పరుగులు పూర్తి చేశాడు.

ఇక వన్డేల్లో 724 పరుగులు, టీ20ల్లో 463 పరుగులు చేసి 2022ను మరుపురాని ఏడాదిగా మార్చుకున్నాడు అయ్యర్.