విధ్వంసక బ్యాట్స్‌మెన్‌గా పేరుపొందిన వివ్ రిచర్డ్స్ తన కెరీర్‌లో 90% కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌ను సాధించాడు. 1975, 1979లో వెస్టిండీస్ ప్రపంచ కప్-విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. రిచర్డ్స్ 1,748 రోజుల పాటు వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు ఇదే ఆధిక్యం.

ఆస్ట్రేలియా క్రికెటర్ మైఖేల్ బెవన్.. 1994లో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును విజయపథంలోకి నడిపించడంలో సమర్థుడు బేవన్. అందుకే ‘ది ఫినిషర్’గా పేరు పొందాడు. బెవాన్ తాను ఆడిన 232 వన్డే మ్యాచ్‌ల్లో 21 సిక్సర్లు కొట్టాడు. వరుసగా 1,259 రోజుల పాటు అగ్రస్థానంలో నిలిచాడు.

ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడుగా విరాట్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కోహ్లీ తన దూకుడు స్వభావంతో ఎన్నో పరుగులు చేశాడు. విరాట్ వరుసగా 1,258 రోజుల పాటు వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగాడు.

ఆస్ట్రేలియా క్రికెటర్ డీన్ జోన్స్.. జనవరి 1984లో పాకిస్తాన్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 1987 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఆర్డర్‌లో మంచి గుర్తింపు పొందిన జోన్స్.. టెస్ట్, వన్డే ఫార్మట్లలో తనదైన ముద్ర వేశాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో 1,146 రోజుల పాటు నెం.1 ర్యాంక్‌లో నిలిచాడు.

బ్రియాన్ లారా, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరు. 1990లో పాకిస్తాన్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. వన్డే ఫార్మాట్‌లో 10,000కు పైగా పరుగులు సాధించాడు. లారా టాప్ స్కోర్ 129 బంతుల్లో 169. లారా చివరి వన్డే 2007లో ఇంగ్లండ్‌తో జరిగింది. లారా 1,049 రోజుల పాటు నం.1 ర్యాంక్‌లో ఉన్నాడు.

వన్డే క్రికెట్‌లో స్థిరమైన ప్రదర్శనతో.. ధోని మొదటిసారి ఏప్రిల్ 2006లో రికీ పాంటింగ్‌ను అధిగమించి టాప్ ర్యాంకింగ్‌ను సాధించాడు. ఆ తరువాత వారానికే.. ఆడమ్ గిల్‌క్రిస్ట్ ధోనీని బీట్ చేశాడు. కొంతకాలం గిల్‌క్రిస్ట్ ఆ స్థానంలో కొనసాగినప్పటికీ.. ధోనీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో 2009లో వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్ ర్యాంక్ సాధించాడు. దాదాపు 701 రోజులు టాప్ ప్లేస్‌లో కొనసాగాడు. అయితే, ధోనీ అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే టాప్ ర్యాంక్ సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కేవలం 24 ఇన్నింగ్స్‌లలోనే 1,198 పరుగుల చేసి, 70.43 సగటుతో టాప్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.