Asia Cup 2022 Records: ఈ ఏడాది ఆసియా కప్ రికార్డులు ఇవే.. లిస్టులో కోహ్లీ, భువీ కూడా.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?

|

Sep 12, 2022 | 10:11 AM

ఆసియా కప్ ఫైనల్ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగి ఉండవచ్చు. కానీ, ఈ ఫైనల్ సమయంలో భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య కూడా మ్యాచ్ జరిగింది.

1 / 5
ఆసియా కప్ ముగిసింది. పాకిస్థాన్‌పై శ్రీలంక 23 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగి ఉండవచ్చు. కానీ, అదే మ్యాచ్‌తో మరొక పోటీ జరిగింది. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ vs మహ్మద్ రిజ్వాన్, అలాగే  భువనేశ్వర్ కుమార్ vs మహ్మద్ నవాజ్ మధ్యలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచారో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 5
ఫైనల్‌కు ముందు, విరాట్ కోహ్లి ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మహ్మద్ రిజ్వాన్ రెండవ స్థానంలో ఉన్నాడు. అయితే ఫైనల్‌లో, రిజ్వాన్ అజేయంగా 78 పరుగులు చేశాడు. దీంతో మొత్తంగా ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు(281) చేసిన ఆటగాడిగా నిలిచాడు.

3 / 5
దీంతో కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. కోహ్లి ఐదు మ్యాచ్‌ల్లో 276 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో కోహ్లీ 2 అర్ధ సెంచరీలు, సెంచరీ సాధించాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై 122 పరుగులతో నాటౌట్‌గా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కాగా రిజ్వాన్ 3 అర్ధ సెంచరీలు చేశాడు.

4 / 5
కోహ్లి, రిజ్వాన్‌లతో పాటు భారత్, పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య మరో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీయాల్సి ఉంది. ఫైనల్‌కు ముందు భారత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ నవాజ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. భువీ 11 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అదే సమయంలో నవాజ్ 8 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా, ఫైనల్ తర్వాత నవాజ్ మూడో స్థానానికి దిగజారగా, వనిందు హసరంగ 9 వికెట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు.

5 / 5
ఈ ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భువీ నిలిచాడు. 4 పరుగులకే 5 వికెట్లు తీయడం ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన. ఆఫ్ఘనిస్థాన్‌పై అతను అద్భుతంగా చేశాడు.