Test Records: టెస్ట్ మ్యాచ్‌లో 5 రోజులు బ్యాటింగ్.. స్పెషల్ రికార్డ్‌లో 13 మంది.. లిస్టులో భారత్ నుంచి ఎవరున్నారంటే?

|

Jun 22, 2023 | 6:43 AM

Usman Khawaja Records: తొలిరోజు ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఉస్మాన్ ఖవాజా 2వ రోజు, 3వ రోజు బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత 4వరోజు, 5వరోజు కూడా బ్యాటింగ్ చేసి, ప్రత్యేక రికార్డ్ నెలకొల్పాడు.

1 / 7
Ashes 2023, Usman Khawaja: ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు రోజులు బ్యాటింగ్ చేయడం సాధ్యమేనా?.. అవును సాధ్యమే. ఈ లిస్టులో ఇప్పటికే చాలామంది ఉన్నారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కొత్తగా చేరాడు.

2 / 7
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అలాగే ఆస్ట్రేలియా జట్టు తొలిరోజే తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.

3 / 7
తొలిరోజు ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఉస్మాన్ ఖ్వాజా 2వ రోజు ముగిసే వరకు బ్యాటింగ్ కొనసాగించాడు. మూడో రోజు ఆటలో 141 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

4 / 7
మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు నాలుగో రోజు ఆటలో 273 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజు ఆటలో ఆస్ట్రేలియాకు ఉస్మాన్ ఖవాజా ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.

5 / 7
అలాగే ఐదో రోజు బ్యాటింగ్ కొనసాగించి 65 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఐదు రోజుల టెస్టు క్రికెట్‌లో బ్యాటింగ్ చేసిన ప్రపంచంలోని 13వ ఆటగాడిగా ఉస్మాన్ ఖ్వాజా నిలిచాడు.

6 / 7
అంతకుముందు మోత్గనల్లి జైసిన్హా (భారత్), జెఫ్రీ బాయ్‌కాట్ (ఇంగ్లండ్), కిమ్ హ్యూస్ (ఆస్ట్రేలియా), అలాన్ లాంబ్ (ఇంగ్లండ్), రవిశాస్త్రి (భారత్), అడ్రియన్ గ్రిఫిత్ (వెస్టిండీస్), ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లండ్), అల్విరో పీటర్సన్ (దక్షిణాఫ్రికా) ఛెతేశ్వర్‌ పుజారా (భారత్‌), రోరీ బర్న్స్‌ (ఇంగ్లండ్‌), క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (వెస్టిండీస్‌), తేజ్‌నారాయణ్‌ చంద్రపాల్‌ (వెస్టిండీస్‌) ఈ ఘనత సాధించారు.

7 / 7
తాజాగా ఉస్మాన్ ఖ్వాజా 5 రోజులు బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్‌పై మొత్తం 518 బంతుల్లో 206 పరుగులు చేసి ప్రత్యేక రికార్డు సృష్టించాడు.