Cinnamon for Weight Loss: కొబ్బరి బోండంలాంటి మీ పొట్ట నాజూగ్గా మారాలంటే.. దాల్చిన చెక్కను ఈ 5 మార్గాల్లో వాడితేసరి!

|

Feb 01, 2024 | 1:48 PM

చలికాలంలో బరువు తగ్గడం కష్టం. కానీ అసాధ్యం కాదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. దాల్చిన చెక్కను మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గొచ్చు. దాల్చిన చెక్క ఆహారానికి రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. కానీ ఈ మసాలా దినుసులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు , కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాదు ఆహారంలో దాల్చిన చెక్క తీసుకుంటే త్వరగా బరువు తగ్గవచ్చు..

1 / 5
చలికాలంలో బరువు తగ్గడం కష్టం. కానీ అసాధ్యం కాదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. దాల్చిన చెక్కను మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గొచ్చు. దాల్చిన చెక్క ఆహారానికి రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. కానీ ఈ మసాలా దినుసులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు , కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాదు ఆహారంలో దాల్చిన చెక్క తీసుకుంటే త్వరగా బరువు తగ్గవచ్చు.

2 / 5
దాల్చిన చెక్క యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే పీచు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

3 / 5
మాంసం లేదా కూరలు వండేటప్పుడు దాల్చిన చెక్కను వినియోగిస్తే బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. అలాగే  దాల్చిన చెక్క లేదా పొడిని వేడి నీటిలో మరిగించి, ఈ దాల్చిన చెక్క టీ తయారు చేసుకుని తాగడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతో బరువు సులువుగా తగ్గుతారు.

4 / 5
సాధారణ టీ లేదా కాఫీలో చక్కెరకు బదులుగా దాల్చిన చెక్క పొడిని వినియోగించవచ్చు. అలాగే వేడి నీటిలో అల్లం రసం, తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తాగాలి. లంచ్ లేదా డిన్నర్ తర్వాత ఈ నీటిని తాగితే బరువు తగ్గడం ఖాయం. అలాగే గ్యాస్-హార్ట్ బర్న్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

5 / 5
అల్పాహారంలో దాల్చిన చెక్కను తీసుకోవచ్చు. రాత్రిపూట వోట్స్ లేదా పాలలో రుచికి దాల్చిన చెక్క పొడిని జోడించవచ్చు. దాల్చినచెక్క, ఓట్స్ కాంబినేషన్‌లో తింటే కడుపు నిండుగా ఉంచుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. దాల్చిన చెక్కను చిరుతిండిగా కూడా తినవచ్చు. పండ్లు లేదా కూరగాయలతో తయారు చేసిన స్మూతీలో దాల్చిన చెక్క పొడిని జోడించవచ్చు. అలాగే ఫ్రూట్ సలాడ్ తినేటప్పుడు కూడా దాల్చిన చెక్క పొడి వినియోగించవచ్చు.