
రిద్ది కుమార్.. లవర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన కథానాయకిగా ఈ మూవీలో అందం, అభినయంతో కట్టిపడేసింది రిద్ది కుమార్. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది రిద్ది కుమార్.

నేడు రిద్ది కుమార్ పుట్టిన రోజు. ఈ యంగ్ బ్యూటీ పుట్టిన రోజుకావడంతో అభిమానులు, సినీ సెలబ్రెటీలు ఈ చిన్నదానికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ చిన్నదాని బ్యూటీ ఫుల్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

రాధేశ్యామ్ సినిమాలో ఒక చిన్న పాత్రలు తళుక్కున మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో అర్చరీ ప్లేయర్ గా కనిపించింది. ఈ బ్యూటికి అనుకున్నంతగా అవకాశాలు కూడా టాలీవుడ్ లో రావడం లేదు. ఇటీవలే ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ సినిమాలో నటించింది.

రాజా సాబ్ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది కానీ ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ తెలుగులో పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోతుంది. అలాగే అటు మలయాళంలోనూ వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

కెరీర్ తొలినాళ్లలో ఈబ్యూటీ గ్లామర్ రోల్స్ చేసేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ భామకు అవకాశాలు అంతగా రావడం లేదని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం గ్లామర్ రోల్స్ లోనూ కనిపిస్తూ మెప్పిస్తుంది రిద్ది కుమార్.