
ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తమ అందంతో కుర్రకారుకు కిర్రెక్కించి.. డ్రీమ్ గర్ల్ అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్న వారిలో దివ్య భారతి ఒకరు. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తమిళ్ సినిమా బ్యాచిలర్ మూవీతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ దివ్య భారతి.. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది ఈ సుందరి. దాంతో ఈ బ్యూటీకి కుర్రాళ్ళు ఫిదా అయ్యారు.

ఆతర్వాత ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చాలా గ్యాప్ తర్వాత జీవి ప్రకాష్ తో కలిసి కింగ్ స్టన్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తుంది ఈ అందాల తార.

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. కానీ ఈ సినిమా విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు.. ఎప్పటినుంచో ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో దివ్యభారతి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లామరస్ ఫొటోలతో నెటిజన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది దివ్య భారతి. తాజాగా ఈ అమ్మడు వదిలిన ఫోటోలు కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి.