Movie Updates: డార్లింగ్ గురించి పృథ్విరాజ్‌.. టాక్సిక్‌లో ఆ స్టార్ హీరోయిన్..

Updated on: Feb 07, 2025 | 7:44 AM

ప్రభాస్‌ చాలా సింపుల్‌గా ఉంటారన్నారు నటుడు పృథ్విరాజ్‌ సుకుమారన్‌. యష్‌ హీరోగా నటిస్తున్న సినిమా టాక్సిక్‌ నుంచి క్రేజీ అప్డేట్. తన భార్య శోభతకు తెలుగు నేటివిటీ అంటే చాలా ఇష్టమని తెలిపారు హీరో నాగచైతన్య. విక్కీ కౌశల్‌, రష్మిక జంటగా నటించిన సినిమా చావా. ఇలాంటి కొన్ని సినిమా అప్డేట్స్ ఎంతో ఈరోజు చూద్దాం.. 

1 / 5
Movie Updates: డార్లింగ్ గురించి పృథ్విరాజ్‌.. టాక్సిక్‌లో ఆ స్టార్ హీరోయిన్..

2 / 5
తన భార్య శోభతకు తెలుగు నేటివిటీ అంటే చాలా ఇష్టమని తెలిపారు హీరో నాగచైతన్య. తన పెళ్లిలో ప్రతిదీ ఆమే డిజైన్‌ చేశారని తెలిపారు. కుటుంబంతో కలిసి ఆనందించిన ఆ క్షణాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయని చెప్పారు. తండేల్‌ ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు. నిజమైన ప్రేమకథలో ఉన్న పెయిన్‌ని, తండేల్‌లో చూస్తారని చెప్పారు.

3 / 5
హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించిన క్రిష్‌ ఫ్రాంఛైజీకి ప్రేక్షకుల్లో అమితాదరణ ఉంది. ఈ సినిమా నెక్స్ట్ పార్టును తెరకెక్కించకపోవడానికి బడ్జెట్టే కారణమని అన్నారు డైరక్టర్‌ రాకేష్‌ రోషన్‌. ఎంత ప్రయత్నించినా బడ్జెట్‌ సమకూరకపోవడంతో చిత్ర నిర్మాణం ఆలస్యమవుతోందన్నారు. గత చాప్టర్స్ తో పోలిస్తే, నెక్స్ట్ మూవీని మరింత గ్రాండ్‌గా తీయలని చెప్పారు.

4 / 5
విక్కీ కౌశల్‌, రష్మిక జంటగా నటించిన సినిమా చావా. ఈ సినిమా నుంచి పృథ్వి ప్రోమో పేరుతో మరో వీడియో పంచుకుంది యూనిట్‌. ఈ నెల 14న విడుదల కానుంది చావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శంభాజీ భార్య ఏసుబాయిగా కనిపించనున్నారు రష్మిక.

5 / 5
యష్‌ హీరోగా నటిస్తున్న సినిమా టాక్సిక్‌. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం బెంగుళూరులో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా జాయిన్‌ అయ్యారు. ప్రస్తుతం వీరందరి మీదా కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొదుతోంది టాక్సిక్‌. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.