Tollywood News: ఆఖరి మూడు నెలల్లో మ్యాజిక్ చేసేదెవరు ??

| Edited By: Phani CH

Oct 01, 2024 | 8:02 PM

కొత్త సంవత్సరం మొదలయ్యీ కాగానే హిట్లూ, ఫ్లాపులూ అంటూ భారీ సినిమాల కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురుచూస్తారో, ఇయర్‌ ఎండింగ్‌లోనూ అదే సందడి రిపీట్‌ అవుతుంది. మనకు ఇంకో మూడు నెలలు మిగిలున్నాయి. రిలీజ్‌కి మేం రెడీ అంటూ ఆల్రెడీ డిక్లేర్‌ చేసిన సినిమాల నెంబరూ పెద్దదే. వాటిలో బిగ్‌ నెంబర్స్ ఆశిస్తున్న మూవీస్‌ ఏంటి? చూసేద్దాం పదండి...

1 / 6

2 / 6
పుష్ప సినిమా డిసెంబర్‌ 6న రావడం పక్కా. కావాలంటే రాసి పెట్టుకోండి అంటూ రిపీటెడ్‌గా చెబుతూనే ఉన్నారు మేకర్స్. అల్లు అర్జున్‌, రష్మిక జంటగా ఫస్ట్ పార్టుతో మేజిక్‌ చేశారు సుకుమార్‌. సెకండ్‌ పార్టులో ఎలా మెస్మరైజ్‌ చేస్తారో చూడ్డానికి పాన్‌ ఇండియా జనాలు వెయిటింగ్‌. అదే డిసెంబర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది గేమ్‌ చేంజర్‌.

3 / 6
జరగండి జరగండి అంటూ దూసుకురావడానికి రెడీ అవుతోంది గేమ్‌  చేంజర్‌. ఆల్రెడీ ప్రమోషన్లలో స్పీడు పెంచేశారు మేకర్స్. క్రిస్మస్‌ కానుకగా సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత చెర్రీ, ఆచార్యలో తళుక్కున మెరిసినా... ఈ సినిమా కోసం మెగా పవర్‌స్టార్‌ ఫ్యాన్స్ ఇష్టంగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్‌లోనే కనులవిందుకు సిద్ధమవుతున్నాడు కన్నప్ప.

4 / 6
విష్ణు మంచు ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా కన్నప్ప. భారీ మల్టీస్టారర్‌గా ఇప్పటికే క్రేజ్‌ తెచ్చుకుంది. భక్తి చిత్రాలకు జనాల ఆదరణ బాగా కనిపిస్తున్న ఈ సమయంలో కన్నప్ప రిజల్ట్ ఎలా ఉంటుందోననే ఆసక్తి మొదలైంది. చాన్నాళ్లుగా హిట్‌ కోసం వెయిట్‌ చేస్తుంది విష్ణు మాత్రమే కాదు.. గోపీచంద్‌ కూడా. ఆయన నటించిన విశ్వమ్‌ సినిమా దసరా బరిలో నిలుస్తోంది.

5 / 6
గోపీచంద్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోంది విశ్వం. చిత్రాలయం వేణు దోనేపూడి, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 11న విడుదల కానుందీ సినిమా. విశ్వం సినిమాకు ఒక్కరోజు ముందు అంటే, అక్టోబర్‌ 10న ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు సూపర్ స్టార్‌ రజనీకాంత్‌.

6 / 6
వేట్టయాన్‌ సినిమా కోసం రజనీ మాత్రమే కాదు అమితాబ్‌, రానా కూడా వెయిటింగ్‌. రజనీ కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాగా ప్రచారమవుతోంది వేట్టయాన్‌. సూపర్‌స్టార్‌తో పోటీ వద్దని వెనక్కి తగ్గిన సూర్య కంగువ నవంబర్‌లో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. చివరి మూడు నెలల్లో ఈ సినిమాలు ఎన్ని కోట్ల కలెక్షన్లు కురిపిస్తాయోననే ఆసక్తి ట్రేడ్‌ వర్గాల్లోనూ మెండుగా కనిపిస్తోంది.