యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

Updated on: May 09, 2026 | 3:45 PM

సీరియల్స్ ద్వారా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శివాని. తెలుగులో అనేక సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన శివాని ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, వివాహం, ఆర్థిక పరిస్థితులపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యూట్యూబ్ ద్వారా అదనపు ఆదాయం పొంది ఫ్లాట్ కొన్నామని తెలిపారు. మధ్యతరగతి నుంచి ఎదిగిన ప్రయాణం, ఆస్తులు, రుణాల గురించి ఉన్న వాస్తవాలను తెలియజేశారు.

1 / 5
 ప్రముఖ టీవీ నటి శివాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, తన వ్యక్తిగత జీవితం, కెరీర్, ఆర్థిక పరిస్థితులు భవిష్యత్ ప్రణాళికల గురించి వివరంగా వెల్లడించారు. ప్రమాదాలు, దురదృష్టాలు జీవితంలో సహజమని, వాటి గురించి అనవసరంగా ఆలోచించి భయపడటం కంటే ముందుకు సాగడం మంచిదని ఆమె తన జీవిత తత్వాన్ని పంచుకున్నారు. తన భర్తతో తమ బంధం గురించి వివరిస్తూ, చిన్నచిన్న విషయాలపై తరచుగా గొడవలు జరుగుతుంటాయని, ఉదాహరణకు, స్నానం చేసిన తర్వాత టవల్ బెడ్‌పై వేయడం లేదా భోజనం చేసేటప్పుడు అన్నం కింద పడేయడం వంటివి ఉంటాయని తెలిపారు.

2 / 5
అయితే ఇవి పెద్ద గొడవలు కావని, ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని కొట్టుకునేంత సమయం తమకు ఉండదని నవ్వుతూ చెప్పారు. తన భర్త తనకు హస్బెండ్‌గా రావడమే జీవితంలో తనకు లభించిన ఉత్తమ బహుమతి అని శివాని అన్నారు. ఆర్థిక వ్యవహారాలపై మాట్లాడుతూ, తన భర్త విపరీతమైన ఖర్చు చేసే వ్యక్తి కావడంతో, ఆయన సంపాదన, తన సంపాదన, కూతురి సంపాదన అంతా తన బ్యాంకు ఖాతాలోనే ఉంటాయని తెలిపారు.  ఏదైనా కొనుగోలు చేయాలంటే ఆయన తనను డబ్బులు అడగాల్సి వస్తుందని చెప్పారు. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన తాము సీరియల్ నటులుగా తమ జీవనం సాగించామని, కొన్ని రోజులు షూటింగ్‌లు ఎక్కువ, కొన్ని రోజులు తక్కువ ఉండేవని తెలిపారు.

3 / 5
కరోనా సమయంలో పని లేక యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించామని, అది తమకు "బోనస్" లాగా అదనపు ఆదాయ వనరుగా మారిందని ఆమె పేర్కొన్నారు. యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో తమకు మంత్లీ మెయింటెనెన్స్‌కి సీరియల్ ఆదాయాన్ని వాడుకుంటూ, యూట్యూబ్ ఆదాయాన్ని పొదుపు చేసి, దానితో డౌన్ పేమెంట్ కట్టి ఒక ఫ్లాట్ కొనుగోలు చేశామని శివాని తెలిపారు. మొదట యూట్యూబ్ ద్వారా 10,000 రూపాయలు సంపాదించగా, ఆ తర్వాత ఒకటిన్నర నెలలో 30 లక్షల రూపాయలు ఒకేసారి తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్ని వేల ఎపిసోడ్‌లు చేసినా సీరియల్స్‌లో ఇంత సంపాదించడం అసాధ్యమని, అందుకే యూట్యూబ్ ఎంత ఆదాయం తెచ్చినా సీరియల్స్‌ను మాత్రం తాను మానలేదని చెప్పారు.

4 / 5
అయితే, ప్రస్తుతం యూట్యూబ్ ఆదాయం తగ్గిందని, కొత్త ఛానెల్స్, యువ కంటెంట్ సృష్టికర్తలు ఎక్కువైపోయారని, వారి కొత్త ఐడియాలు, కాన్సెప్ట్‌లు తమకు స్ఫూర్తినిస్తున్నాయని ఆమె అన్నారు. తన వద్ద 15-20 కోట్ల విలువైన బంగారం ఉందని వస్తున్న పుకార్లను ఖండించిన శివాని, సీరియల్స్‌లో ధరించే నగలు నకిలివి అని, తన వంటిపై ప్రస్తుతం ఉన్నదే తనదైన బంగారం అని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ ఆస్తులన్నీ లోన్లపైనే ఉన్నాయని, రుణ రహితంగా తన కూతురి పేరు మీద 300 గజాల స్థలంలో (రాజనందిని గార్డెన్స్) ఒక ఇల్లు కట్టుకుంటున్నామని అన్నారు.

5 / 5
అది కూడా కొద్దికొద్దిగా డబ్బులు చెల్లిస్తూ లోన్ లేకుండా నిర్మిస్తున్నామని తెలిపారు. ఆస్తి తగాదాలకు సంబంధించి వదినతో కొన్ని సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని కూడా ఆమె వెల్లడించారు. ఆమె తన భర్త విక్రమ్‌తో కలిసి రన్ చేస్తున్న ఛానల్స్ ద్వారా హోమ్ టూర్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ , పర్సనల్ లైఫ్ విశేషాలను పంచుకుంటూ మంచి ఆదరణ పొందుతున్నారు. శ్రీవాణి తన 17వ ఏటనే విక్రమ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె (నందిని) ఉంది. ఆమె తరచుగా తన కుటుంబంతో కలిసి చేసే అల్లరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Follow Us