తిరుగులేని అందాల తార.. కానీ జీవితం మొత్తం కష్టాలే.. ఇల్లు కూడా అద్దెకు ఇవ్వం పో అన్నారు..

Updated on: May 09, 2026 | 8:24 PM

సిల్క్ స్మిత కంటే ముందే సినీ ప్రపంచంలో డ్యాన్సింగ్ సంచలనంగా వెలుగొందిన తార ఈ అందాల భామ. స్టార్ హీరోలను మించిన క్రేజ్ ను సొంతం చేసుకున్న ఆమె జీవితం కష్టాలు, సవాళ్లతో నిండి ఉంది. డెబ్బైవ దశకంలో వెండితెరను ఏలిన ఈ డ్యాన్సింగ్ సంచలనం, ముఖ్యంగా ప్రత్యేక గీతాలకు, గ్లామరస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.

1 / 6
సిల్క్ స్మిత కంటే ముందే సినీ ప్రపంచంలో డ్యాన్సింగ్ సంచలనంగా వెలుగొందిన తార ఈ అందాల భామ. స్టార్ హీరోలను మించిన క్రేజ్ ను సొంతం చేసుకున్న ఆమె జీవితం కష్టాలు, సవాళ్లతో నిండి ఉంది. డెబ్బైవ దశకంలో వెండితెరను ఏలిన ఈ డ్యాన్సింగ్ సంచలనం, ముఖ్యంగా ప్రత్యేక గీతాలకు, గ్లామరస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఆమె ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. కళను దైవంగా భావించి, ఎన్నో అవమానాలను తట్టుకొని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. ఆమె ఎవరో కాదు జ్యోతిలక్ష్మి.

2 / 6
1970వ దశకంలో భారతీయ సినీ రంగంలో, ముఖ్యంగా దక్షిణాదిలో ఆమె ఒక డ్యాన్సింగ్ సెన్సేషన్ గా వెలుగు వెలిగారు. ఆమె పేరు కేవలం ఒక నటిది కాదు, ఇండస్ట్రీలో అదొక బ్రాండ్‌గా నిలిచింది. థియేటర్లలో ఆమె పాట మొదలైతే, యువత హృదయ స్పందన పెరిగేది, సినిమాకి కొత్త కళ వచ్చేది. ఎల్.ఆర్. ఈశ్వరి పాట, జ్యోతిలక్ష్మి నృత్యం ఆ రోజుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. దాదాపు 20 ఏళ్ల పాటు తన పాటతో సినీ లోకాన్ని ఏలిన జ్యోతిలక్ష్మి, తెలుగు సినిమా ప్రత్యేక గీతాలకు తొలి అడుగును నేర్పిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆమె సోదరి జయమాలిని కూడా తర్వాత కాలంలో గ్లామరస్ స్పెషల్ సాంగ్స్ క్వీన్ గా ఎదిగారు. జ్యోతిలక్ష్మి చిన్నతనంలోనే తన సోదరి ధనలక్ష్మికి రామరాజన్ ద్వారా దత్తత ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు టి.ఆర్. రామన్న ఆమెకు దగ్గర బంధువు కాగా, తమిళ సినిమా తొలి డ్రీమ్ గర్ల్ టి.ఆర్. రాజకుమారి ఆమెకు అత్త వరుస అవుతారు.

3 / 6
1944లో వచ్చిన కూండుక్కిలి చిత్రంతో బాలనటిగా పరిచయమయ్యారు. 1963లో ఎం.జి.ఆర్. హీరోగా నటించిన పెరియ ఇడత్తు పెణ్ చిత్రంతో జ్యోతిలక్ష్మి పేరుతో తెరపైకి వచ్చి అదే పేరుతో కొనసాగారు. చిన్నతనంలోనే ప్రసిద్ధ నాట్యాచార్యుడు తంజయ్ రామయ్య దాస్ పిళ్ళై దగ్గర భరతనాట్యం నేర్చుకోవడం ఆమె కెరీర్ కు పునాది వేసింది. తెలుగులో ఆమె తొలి చిత్రం 1967లో వచ్చిన పెద్దక్కయ్య. శోభన్ బాబు హీరోగా నటించిన ఇదాలోకం చిత్రంలోని "గుడి వెనక నా సామి గుర్రమెక్కి కూర్చున్నాడు" పాట భారీ హిట్ అయింది. అప్పటి నుంచి స్పెషల్ సాంగ్స్ కి ఆమె కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. 1970లలో జానపదం, క్రైమ్, సాంఘికం ఇలా ఏ సినిమా అయినా జ్యోతిలక్ష్మి పాట తప్పనిసరిగా ఉండేది.

4 / 6
ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరం నుంచి చిరంజీవి, బాలకృష్ణ వరకు అనేక ప్రముఖ నటులతో కలిసి నటించారు. నలుపు తెలుపు చిత్రాల నుంచి రంగుల సినిమాల వరకు ఆమె హవా కొనసాగింది. 300కు పైగా చిత్రాల్లో 1000కి పైగా పాటలకు నృత్యం చేసిన ఆమె, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా నటించి పాపులారిటీ సంపాదించుకున్నారు. వ్యక్తిగత జీవితంలోనూ ఆమె ఎన్నో అవమానాలను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఒకసారి అద్దె ఇంటి కోసం చెన్నై మొత్తం తిరిగినా, "మీలాంటి డ్యాన్సర్‌లకు మేము ఇల్లు ఇవ్వం" అని మొహం మీదే చెప్పేశారట. ఇలాంటి పరిస్థితులలోనూ చెక్కు చెదరని ధైర్యంతో ముందుకు సాగిన ఆమె, "తెరపై మా నటన చూసి మా క్యారెక్టర్ ని అంచనా వేస్తే ఎలా? నృత్యం నా వృత్తి, అదే నా దైవం. నేనెప్పుడూ నన్ను తక్కువ చేసుకోను. ఎవరెన్ని అనుకుంటే నాకేమిటి?" అని ప్రశ్నించేవారు.

5 / 6
తన కెరీర్ లో మొదట సహనటి విజయలలిత నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఆమెకు, ఆ తర్వాత తన చెల్లెలు జయమాలిని నుంచే పోటీ ఎదురైంది. అయినా, పోటీ ఇచ్చింది తన చెల్లెలే కదా అని మురిసిపోయేవారు. తన కెరీర్ పీక్ స్టేజ్‌లో, అంటే 1970వ దశకంలో తమిళనాడులోని మన్నార్ గుడికి చెందిన వాసుదేవన్‌తో ఆమె వివాహం జరిగింది. వాసుదేవన్‌కు అప్పటికే భార్య ఉన్నప్పటికీ పిల్లలు లేరు. అతని తల్లి ఆదేశం మేరకు జ్యోతిలక్ష్మి అతనికి భార్య అయ్యారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో, వీరి వివాహాన్ని రహస్యంగా ఉంచి సహజీవనం చేశారు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి గుర్తుగా కూతురు మీనాక్షిని కన్నారు.

6 / 6
అయితే ఈ ఎనిమిదేళ్లు వాసుదేవన్ ఆమెను తీవ్రంగా వేధించారు. అతని ప్రవర్తన కారణంగా ఆమె కొన్ని సినిమాలు కూడా కోల్పోయి ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలోనే ఆమె చెల్లెలు జయమాలిని సినీ రంగ ప్రవేశం చేసింది. వాసుదేవన్ బారి నుంచి తప్పించుకునేందుకు ముంబై పారిపోయిన జ్యోతిలక్ష్మి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చారు. వాసుదేవన్‌తో సంబంధం లేదని ప్రకటించిన తర్వాత ఛాయాగ్రాహకుడు సాయి ప్రసాద్ ను పెళ్లి చేసుకున్నారు. జ్యోతిలక్ష్మి కూతురు మీనాక్షి, జ్యోతి మీనా పేరుతో నటిగా పరిచయమైనా తల్లిలా పేరు తెచ్చుకోలేకపోయారు. జ్యోతిలక్ష్మి 2016 ఆగస్టు 9న బ్లడ్ క్యాన్సర్‌తో కన్నుమూశారు. 

Follow Us