ఆమెకు నా కూతురు వయసు ఉంటుంది.. అందుకే సినిమాకి నో చెప్పా : వేణు

Updated on: Oct 20, 2026 | 1:57 PM

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో వేణు తొట్టెంపూడి ఒకరు. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను నవ్వించడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలతో ఒకప్పుడు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

1 / 5
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో వేణు తొట్టెంపూడి ఒకరు. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను నవ్వించడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలతో ఒకప్పుడు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న వేణు గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఓ యంగ్ హీరోయిన్‌తో కలిసి నటించే విషయంలో ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ కథేంటి?

2 / 5
 వేణు తొట్టెంపూడి హీరోగా పరిచయమైన చిత్రం స్వయంవరం. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఆయన, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన చిరునవ్వుతో సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తర్వాత  వీడెక్కడి మొగుడండి?, హనుమాన్ జంక్షన్, ప్రియనేస్తమా, మళ్లీమళ్లీ చూడాలి, కళ్యాణ రాముడు, పెళ్లాం ఊరెళితే, పెళ్లాంతో పనేంటి వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

3 / 5
ముఖ్యంగా కామెడీ సన్నివేశాల్లో ఆయన చూపించే టైమింగ్, అమాయకంగా కనిపించే హావభావాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో అప్పట్లో వేణు సినిమాలకు కుటుంబ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలు అందుకున్న వేణు తొట్టెంపూడికి ఆ తర్వాత కాలంలో ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. వరుస పరాజయాల ప్రభావంతో హీరోగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము సినిమాలో సహాయక పాత్రలో కనిపించారు.

4 / 5
ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న వేణు.. రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో తిరిగి వెండితెరపైకి వచ్చారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అనంతరం 2023లో విడుదలైన అతిథి అనే హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌తో వేణు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీంతో ఆయన మళ్లీ సినిమాల్లో బిజీ అవుతారని అభిమానులు భావించినప్పటికీ, ఆ తర్వాత ఆయన నుంచి పెద్దగా ప్రాజెక్టులు కనిపించలేదు.

5 / 5
తాజాగా వేణు తొట్టెంపూడికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం నెట్టింట చర్చకు వచ్చింది. ఒక సినిమాలో అనన్య శర్మను హీరోయిన్‌గా ఎంపిక చేయాలని చిత్రబృందం భావించగా, వేణు అందుకు అంగీకరించలేదనే ప్రచారం జరుగుతోంది. తన వయసుకు, ఆ హీరోయిన్ వయసుకు మధ్య చాలా వ్యత్యాసం ఉండటంతో ఆమెతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం తనకు సౌకర్యంగా ఉండదని ఆయన చెప్పినట్లు కథనాలు వెలువడుతున్నాయి. తనకు దాదాపు 50 ఏళ్లు ఉంటే, ఆ హీరోయిన్ వయసు సుమారు 22 ఏళ్లు అని, ఆమె తన కూతురి వయసులో ఉంటుందని వేణు అన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. 

Loading...
Unable to load recommendations.
Follow Us