
బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు, త్రిప్తి దిమ్రిల చిత్రం 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో'. 2024లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ కామెడీ డ్రామాను చూడటానికి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.

ఈ కథ 90వ దశకంలో జరుగుతుంది. రిషికేశ్‌లో విక్కీ (రాజ్‌కుమార్ రావు), విద్యా (త్రిప్తి దిమ్రి) చిన్ననాటి స్నేహితులు. వారి కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. దీంతో వారిద్దరికి పెళ్లి చేస్తారు పెద్దలు. వారి ఇళ్ల నుండి వైష్ణో దేవికి వెళ్ళమని చెబుతారు, కానీ విక్కీ వారి హనీమూన్ కోసం విద్యాను గోవాకు తీసుకువెళ్తాడు. అక్కడ తమ వెకేషన్ సరదగా గడుపుతుంటారు.

అయితే విక్కీ తమ మొదటి రాత్రిని ఒక వీడియోలో బంధిస్తాడు. అయితే ఇంటికి వచ్చాకా విక్కీ ఇంట్లో దొంగలు పడి, అతని సీడీలు, సీడీ ప్లేయర్, టీవీతో సహా అన్నీ దొంగిలిస్తారు. ఈ విషయం విద్యాకు చెబితే ఆమె తనను వదిలి వెళ్ళిపోతుందనే భయంతో విక్కీ ఆమెకు చెప్పడు. ఇక అప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఆ సీడీని కనిపెట్టడానికి ఒంటరిగానే ప్రయత్నిస్తుంటాడు విక్కీ. అనుకోకుండా పెద్ద చిక్కులో పడిపోతాడు.

ఆ సమయంలో విక్కీ ఒక హత్య కేసులో చిక్కుకుంటాడు. విక్కీ విద్యాకు సంబంధించిన ఆ వీడియోను కనుగొనగలుగుతాడా? విక్కీ ఆ హత్య కేసులో తన నిర్దోషి అని నిరూపించుకోగలుగుతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా కథ ఆసక్తికరంగా, వినూత్నంగా ఉంటుంది. హాస్యంతో నిండిన ఈ సినిమా మీకు విసుగు పుట్టించదు.

అలాగే ఈ చిత్రంలో విక్కీ సోదరి పాత్రలో మల్లికా షెరావత్ చాలా సంవత్సరాల తర్వాత నటించారు. షెహనాజ్ గిల్ కూడా ఒక అతిథి పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో షెహనాజ్‌పై చిత్రీకరించిన "సజ్నా వే సజ్నా" అనే పాట సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి రాజ్ శాండిల్యా దర్శకత్వం వహించగా.. ఈ మూవీ ఆద్యంతం మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటుంది. సచిన్, జిగర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.