ఇటీవల సోషల్ మీడియా వాడకం మరింత పెరిగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రేటీల వరకు అందరూ నెట్టింట్లో మునిగితేలుతున్నారు. ఇక ఇన్స్టా వలన హీరోహీరోయిన్స్ తమ అభిమానులతో కలిసి లైవ్ ద్వారా ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ వ్యక్తిగత విషయాలను, చిన్ననాటి ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు.