Sreeleela : అదృష్టం అంటే అమ్మాడిదే.. మరో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడిగా..

Updated on: Jan 25, 2026 | 11:26 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ శ్రీలీల. అందం, అభినయంతో ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్ గా మారింది. ఇప్పుడిప్పుడే తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటుంది ఈ అమ్మడు. తాజాగా మరో ఛాన్స్ కొట్టేసింది.

1 / 5
పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది శ్రీలీల. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు..ఆ తర్వాత ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఒక్కసారిగా  ఈ బ్యూటీ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది.

2 / 5
తెలుగులో టాప్ హీరోస్ అందరి సరసన అవకాశాలు దక్కించుకుంటూ.. తక్కువ సమయంలోనే బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది. శ్రీలీల కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. కానీ ఇప్పుడు ఈ అమ్మడు కాస్త ఒడిదుకుడులతో సాగుతుంది.

3 / 5
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల పరాశక్తి సినిమాతో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. శివకార్తికేయన్ సరసన నటించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

4 / 5
ఇక ఇప్పుడు ఈ అమ్మడు కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. నటుడు ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించబోయే కొత్త సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఈ అమ్మడు రెండో హీరోయిన్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి కనిపించనుంది.

5 / 5
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ విషయంపై శ్రీలీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ హీరో ప్రదీప్. ఇప్పటికే వరుస సినిమాలతో హిట్స్ అందుకున్న  ఈ హీరో.. ఇప్పుడు శ్రీలీలతో కలిసి నటించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.